Baladitya: హీరో బాలాదిత్య టాప్ సెలబ్రిటీ హోదాలో బిగ్ బాస్ హౌస్లో ప్రవేశించారు. బాలాదిత్య టీచర్ కూడాను. ఆయన సిఏ విద్యార్థులకు పాఠాలు చెబుతారట. బాల ఆదిత్య బిజినెస్ మాన్, అలాగే సింగర్. ఆయనలో చాలా కళలు ఉన్నాయి. ఒక టీచర్ గా హౌస్లో బాల ఆదిత్య ఆ హుందాతనం మైంటైన్ చేశారు. తోటి హౌస్ మేట్స్ కి మార్గదర్శిగా, పెద్దగా ఉండేవాడు. విషయం ఏదైనా సహనంగా సమాధానం చెప్పేవాడు. గేమ్స్, టాస్క్స్ లో వంద శాతం ఎఫ్ఫార్ట్స్ పెట్టేవాడు.

బాలాదిత్య హౌస్లో 10 వారాలు ఉన్నారు. ఇతర కంటెస్టెంట్స్ పై ఆయన బరస్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఒక టాస్క్ లో బాలాదిత్య వీక్నెస్ తో శ్రీహాన్, శ్రీసత్య ఆడుకున్నారు. అది చేసింది గీతూ అని నమ్మిన బాలాదిత్య ఆమెపై ఫైర్ అయ్యాడు. నీకు సిగ్గుందా? ఆడపిల్లవేనా? అంటూ బరస్ట్ అయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. బాలాదిత్య సిగరెట్ కి బానిస అన్నట్లు ఆ సీన్ ప్రొజెక్ట్ అయ్యింది. గీతూని తిట్టడం కూడా నెగిటివ్ గా పోయింది.
కారణాలు ఏవైనా బాలాదిత్య అంచనాలు అందుకోకుండానే ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ లో బాలాదిత్య ఆ డిగ్నిటీ మైంటైన్ చేశాడు. రొటీన్ గా ఉండే ఏడుపులు పెడబొబ్బలు లేకుండా ఎలిమినేషన్ అంగీకరించి బయటకు వచ్చేశాడు. కాగా బాలాదిత్య హౌస్లోకి వెళ్ళడానికి జస్ట్ ఒకటి రెండు రోజులు ముందు రెండో కూతురు పుట్టింది. దీంతో కన్నకూతురిని బాలాదిత్య తనివితీరా ముద్దాడక ముందే షోకి వచ్చేశాడు.

కాగా బాలాదిత్య రెండో కూతురికి పేరు పెట్టలేదు. హౌస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసిన ఆయన భార్య మీరు వచ్చాక పెడదామని చెప్పింది. డిసెంబర్ 15న బాలాదిత్య కూతురు బారసాల జరిగింది. పాపకు నామకరణం చేశారు. ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు. పాపకు వెంకట యాగ్న్య విధార్తి అని పేరు పెట్టారు. బాలాదిత్య రెండో కూతురు చాలా క్యూట్ గా ఉంది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇనయా, వాసంతి, గీతూతో పాటు బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ హాజరయ్యారు.