
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 మొత్తంగా ఫెయిల్ అయ్యిందని చెప్పొచ్చు. గత సీజన్ ప్రేక్షకులకు కిక్ ఇవ్వలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. హోస్ట్ గా నాగార్జున విఫలం చెందారనేది మొదటి ఆరోపణ. ఆయన ఈసారి అద్భుతం చేయలేకపోయారు. హౌస్ మేట్స్ మీద ఆయన రివ్యూలు సరిగా ఉండేవి కావు. కొందరి పట్ల సాఫ్ట్ గా మరికొందరి పట్ల హార్ట్ గా వ్యవహరించారు. అదే సమయంలో పసలేని కంటెస్టెంట్స్, కొత్తదనం లేని గేమ్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయాయి. కోట్లు ఖర్చుపెట్టి చేస్తున్న రియాలిటీ షోకి దారుణంగా 2-3 టీఆర్పీ రావడం ఊహించని పరిణామం.
వీకెండ్స్ లో కూడా టీఆర్పీ పెరిగేది కాదు. ఇక ఫినాలే అత్యంత అద్వానంగా ముగించారు. ఓట్లు ఒకరికి వచ్చాయని విజేత మరొకరు అయ్యారని తేల్చారు. గత ఐదు సీజన్స్ లో ఎన్నడూ రానంత తక్కువ రేటింగ్ బిగ్ బాస్ 6 ఫినాలేకి వచ్చింది. చెప్పాలంటే గత సీజన్స్ రేటింగ్ లో సగం కూడా రాలేదు. ఈ క్రమంలో సమూల మార్పులు చేయాలనుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7కి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.
ముందు హోస్ట్ నాగార్జునను పక్కన పెట్టేశారట. వరుసగా నాలుగు సీజన్స్ కి హోస్ట్ గా ఉన్న నాగార్జున సీజన్ 7 చేయడం లేదట. ఆయన స్థానంలో దగ్గుబాటి రానా వస్తున్నారట. దగ్గుబాటి రానా మంచి వ్యాఖ్యాత. గంభీరమైన స్వరం, భారీ కట్ అవుట్… కాబట్టి రానా బెస్ట్ ఆప్షన్ అని మేకర్స్ నమ్ముతున్నారు. ఆయన్ని రంగంలోకి దింపనున్నారట. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి.

అలాగే కంటెస్టెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బాగా తెలిసిన ఫేసులు ఇంట్లోకి పంపనున్నారట. ఈ క్రమంలో కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. టిక్ టాక్ డాన్స్ వీడియోలతో ఫేమస్ అయిన దుర్గారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతడు సీజన్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. ఆయనతో చర్చలు జరుపుతున్నారట. అలాగే టాప్ సెలెబ్రిటీలైన హైపర్ ఆది, దీపికా పిల్లి, వైష్ణవి చైతన్య పేర్లు పరిశీలించడంతో పాటు వారిని ఈ మేరకు సంప్రదిస్తున్నారట. మొత్తంగా ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా సీజన్ 7 ని సిద్ధం చేస్తున్నారట. జూన్ నెలలోనే షో మొదలుకానుందంటున్నారు.