spot_img
Homeఎంటర్టైన్మెంట్Nagarjuna- Srihan: నాగార్జున కుట్రకు బలైన శ్రీహాన్... అంత పెద్ద కథ నడిచిందా!

Nagarjuna- Srihan: నాగార్జున కుట్రకు బలైన శ్రీహాన్… అంత పెద్ద కథ నడిచిందా!

Nagarjuna- Srihan: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినట్లే సింగర్ రేవంత్ టైటిల్ అందుకున్నారు. రేవంత్ ప్రవర్తన పరంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే గేమ్ విషయంలో అతడు పోరాట పటిమ చూపించేవాడు. ప్రతి టాస్క్ లో విన్నర్ తానే కావాలనే తాపత్రయం కనిపించేది. అందుకు వంద శాతం ఎఫ్ఫార్ట్స్ పెట్టేవాడు. ఈ క్రమంలో అతడి కోపం హద్దులు దాటేది. తోటి కంటెస్టెంట్స్ ని తిట్టడం, దెబ్బతలు తగిలేలా గేమ్ ఆడటం చేసేవాడు. ఇది రేవంత్ పై వ్యతిరేకతకు కారణమైంది. అతనిలో నెగటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ… సరైన పోటీ లేకపోవడం, ఎప్పటి నుండో ఉన్న ఫ్యాన్ బేస్ విన్నర్ ని చేసింది.

Nagarjuna- Srihan
Nagarjuna- Srihan

ఈ సీజన్లో కొంచెం ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ ముందుగానే ఎలిమినేట్ అయ్యారు. ఇండియన్ ఐడల్ విన్నర్ , స్టార్ సింగర్ అయిన రేవంత్ అంత పాపులారిటీ ఇంకెవరికీ లేదు. అతనికి ఎప్పటి నుండో ఉన్న అభిమాన వర్గం మద్దతుగా నిలిచారు. ఈ కారణాలతో రేవంత్ ఫైనల్ కి చేరాడు. చివరి నిమిషం వరకు విన్నర్ రేవంత్ అని అందరూ నమ్మారు. రేవంత్, శ్రీహాన్ లతో జర్నీ చేసిన కంటెస్టెంట్స్ కూడా అదే అభిప్రాయం వెల్లడించారు.

ఐతే ఫైనల్ రిజల్ట్ అందరి అంచనాలు తప్పని తేల్చింది. ప్రేక్షకులు రేవంత్ కాదు శ్రీహాన్ విన్నర్ కావాలని కోరుకున్నట్లు హోస్ట్ నాగార్జున తెలియజేశారు . చాలా తక్కువ మార్జిన్ తో రేవంత్ పై శ్రీహాన్ ఓట్లలో పై చేయి సాధించాడని వెల్లడించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కూడా నాగార్జున చెప్పిన చేదు నిజం మైండ్ బ్లాక్ చేసింది. కేవలం రూ. 40 లక్షలకు ఆశపడి టైటిల్, ప్రైజ్ మనీ మొత్తంగా దక్కించుకునే సువర్ణావకాశాన్ని శ్రీహాన్ కోల్పోయాడు. రేవంత్ ని విన్నర్ ని చేయకపోతే పెద్ద మొత్తంలో నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన బిగ్ బాస్ టీమ్ తెలివిగా శ్రీహాన్ ని ఇరికించారని తెలుస్తుంది.

Nagarjuna- Srihan
Nagarjuna- Srihan

ఇప్పటికే ఎలిమినేషన్స్ ఫేక్ అంటూ ప్రచారం జరుగుతుంది. అలాగే అనేక కోణాల్లో షో విమర్శల పాలవుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ కంటే శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయంటే ఎవరూ నమ్మరు. శ్రీహాన్ ని విన్నర్ గా ప్రకటిస్తే పెద్ద ఎత్తున విమర్శలు రావచ్చు. దీంతో శ్రీహాన్ ని టెంప్ట్ చేసి విన్నర్ పొజీషన్ రేవంత్ కి కట్టబెట్టాలని ప్లాన్ చేశారు. అందుకే ప్రైజ్ మనీకి సమానమైన రూ. 40 లక్షలు ఆఫర్ చేశారు. సాధారణంగా రూ. 25 లక్షలు ఆఫర్ చేయడమే ఎక్కువ. మొత్తంగా తమపై ఎలాంటి నెగిటివిటీ రాకుండా శ్రీహాన్ ని ట్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper