Bigg Boss 6 Telugu- Revanth: బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం కుదించిన టైటిల్ విన్నర్ క్యాష్ ప్రైజ్ ని తిరిగి టాస్కుల ద్వారా రప్పించుకునే అరుదైన అవకాశం ని బిగ్ బాస్ కల్పించాడు..ఈ వారం మొత్తం వివిధ లెవెల్స్ లో ఈ టాస్కులు ఆడి కంటెస్టెంట్స్ తిరిగి క్యాష్ ప్రైజ్ మనీ మొత్తాన్ని 50 లక్షల రూపాయలకు చేర్చాల్సి ఉంటుంది..కొద్ది వారాల క్రితం టాస్కుల ద్వారా క్యాష్ ప్రైజ్ ని బిగ్ బాస్ తగ్గించడం తో కంటెస్టెంట్స్ తో పాటు, ప్రేక్షకులు కూడా నిరుత్సాహానికి గురైన సంగతి తెలిసిందే..అప్పుడు బిగ్ బాస్ ఎందుకు అలా తగ్గించాడో..ఇప్పుడు అందరికి అర్థం అయ్యింది..క్యాష్ ప్రైజ్ లో ఒక్క రూపాయి కూడా తగ్గదు అనేది అందరికి అర్థం అయ్యిపోయింది.

ఇప్పుడు క్యాష్ ప్రైజ్ 38 లక్షల రూపాయిల నుండి 46 లక్షల రూపాయలకు చేరుకుంది..ఇక నిన్న కన్ఫెషన్ రూమ్ లో దెయ్యాల కొంప సెటప్ వేసి ఒక్కొక్కరిగా లోపాలకి పిలిచి బిగ్ బాస్ చెప్పినట్టు చీకట్లో పడున్న వస్తువులను బిగ్ బాస్ తీసుకోమనే టాస్కులో నిన్న ఆడి రెడ్డి మరియు శ్రీహాన్ లోపలకు రాగా వాళ్ళని ప్యాంటు తడిచిపొయ్యే రేంజ్ లో బిగ్ బాస్ బయటపెట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఈరోజు కూడా ముందుగా కన్ఫెషన్ రూమ్ లోకి శ్రీ సత్య ని పిలుస్తాడు బిగ్ బాస్..శ్రీ సత్య పోవడానికి భయపడడం తో బిగ్ బాస్ లక్ష రూపాయిలు కట్ చేస్తాడు..ఇక ఆ తర్వాత కాసేపటికి ఇనాయ ని పిలుస్తాడు బిగ్ బాస్..ఈమె చాలా బిల్డప్ ఇస్తూ లోపాలకి వెళ్తుంది..చివరికి అక్కడున్న సెటప్ ని చూసి భయపడిపోతుంది..ఇక ఆమె భయం తో అరుస్తున్న అరుపుల్ని చూసి బయటున్న కంటెస్టెంట్స్ పడీపడీ నవ్వుతారు..బయటకి వచ్చిన తర్వాత ఈమె ‘లేడీ టైగర్’ అంట అంటూ శ్రీహాన్ ,ఆడి రెడ్డి అందరూ తెగ వెక్కిరిస్తారు..ఇక చివరికి రేవంత్ అడుగుపెడతాడు..అందరి లాగానే ఇతను కూడా భయపడుతాడని అనుకున్నారు.

కానీ లోపాలకి అడుగుపెట్టిన క్షణం నుండి దెయ్యానికి కౌంటర్ ఇవ్వడం ప్రారంభిస్తాడు..సౌండ్ ఎఫెక్ట్స్ దేనికి కూడా భయపడడు..దెయ్యం నవ్వితే , రేవంత్ కూడా నవ్వి ‘నేను కూడా దెయ్యాన్ని’ అంటూ కౌంటర్ ఇస్తాడు..అలా కంటెస్టెంట్స్ అందరిలో దెయ్యానికి భయపడకుండా లోపల బిగ్ బాస్ చెప్పిన ఐటెం ని తీసుకొచ్చిన ఏకైక కంటెస్టెంట్ గా రేవంత్ నిలిచాడు.
https://www.youtube.com/watch?v=4D9Y4LRpmUc