Faima Elimination- Adi Reddy: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి వారం నుండి నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా రేవంత్ మరియు శ్రీహన్ తో పాటు బలమైన వోటింగ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ ఫైమా..ఎందుకంటే ఆమె హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే జబర్దస్త్ అనే పాపులర్ కామెడీ షో ద్వారా పెద్ద సెలబ్రిటీ గా కొనసాగింది..అందుకే ఆమెకి వోటింగ్ అంత బాగుండేది..టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఆమె కచ్చితంగా ఉంటుందని అనుకున్నారు.

ఎందుకంటే ఆమె ఎంటర్టైన్మెంట్ ని పంచడం తో పాటు, ఫిజికల్ టాస్కులు కూడా అద్భుతంగా ఆడింది..కానీ వారాలు గడిచే కొద్దీ ఆమెలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ పూర్తిగా పొయ్యి..కేవలం ఫిజికల్ టాస్కులలోనే తన సత్తాని చాటుకుంటూ వచ్చింది..దీనితో ఆమె గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది..గత రెండు మూడు వారాలుగా అయితే మరింత తగ్గిపోయింది..బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె ఇనాయ , సూర్య , రాజ్ మరియు ఆది రెడ్డి తో చాలా క్లోజ్ గా ఉంటూ వచ్చింది.
అయితే ఈరోజు ఆమె హౌస్ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆది రెడ్డి వెక్కిళ్లు పెట్టి ఏడ్చేశాడు..అది చూసి ఫైమా కూడా ఏడ్చేసింది..హౌస్ లో తనకి మొదటి వారం నుండి క్లోజ్ గా ఉంటూ వచ్చిన గీతూ ఎలిమినేట్ అయ్యినప్పుడు కూడా ఆయన ఇంతలా బాధపడలేదు ఆది రెడ్డి..అలాంటిది ఫైమా ఎలిమినేట్ అయ్యినప్పుడు ఇలా ఏడుస్తున్నాడు ఏంటి అని హౌస్ మేట్స్ తో పాటు గీతూ కూడా సోషల్ మీడియా లో షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.

‘ఆది అన్నని బాగా చూసుకో’ అంటూ ఇనాయ కి ఫైమా చెప్పడం తో ఆది రెడ్డి బాగా ఎమోషనల్ అయిపోయాడు..రేవంత్ కూడా ‘ఆది గీతూ ఎలిమినేట్ అయ్యినప్పుడు కూడా ఏడవలేదు..ఫైమా కోసం ఏడ్చేశాడు’ అని అంటాడు..అప్పుడు ఆది రెడ్డి ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు లాస్ట్ లో ఆ మాట అనింది..అందుకే నా వల్ల కాక ఏడ్చేసాను అంటాడు..అలా ఫైమా జర్నీ బిగ్ బాస్ హౌస్ లో ముగిసింది.