Ram Charan Emotional: మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అవ్వాలని రూల్ లేదు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పటి వరుకు సూపర్ స్టార్స్ మెగా స్టార్స్ వారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ కాలేకపోయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..కానీ మన టాలీవుడ్ లో మాత్రం మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ ని మించిన స్టార్ అయిపోయాడు..చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ తొలి సినిమాతోనే తన నటనతో, డాన్స్ తో తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు.

ఆ తర్వాత అటు బాక్స్ ఆఫీస్ పరంగా ఇటు నటన పరంగా అంచలంచలుగా ఎదుగుతూ నేడు #RRR సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు..లేటెస్ట్ గా ఆయన ఇంటర్నేషనల్ ఛానల్ గా ప్రఖ్యాతి గాంచిన NDTV అవార్డ్స్ ‘ట్రూ లెజెండ్: ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ అవార్డు ని సొంతం చేసుకున్నాడు..ఇది తండ్రి గా మెగాస్టార్ చిరంజీవి కి మరియు అభిమానులకు ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ విషయం.
ఈ అవార్డు ఫంక్షన్ లో తన తండ్రి చిరంజీవి గురించి..ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంతో ఎమోషనల్ అవుతూ రామ్ చరణ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ముఖ్యం చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి ఆయన మాట్లాడుతూ ‘1997 వ సంవత్సరం లో మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన స్నేహితుడు రక్తం అందుబాటులో లేక చనిపోయాడు..అది నాన్న గారి మనసుని బాగా కలిచి వేసింది.

ఆయన బాధపడుతుండడం చూసి నేను కూడా బాధపడేవాడిని..మనం ఏ కాలం లో ఉన్నాము..ఇప్పటికి కూడా ఒక మనిషికి రక్తం అందుబాటులో లేక చనిపొయ్యే పరిస్థితులు ఉన్నాయా అని బాధపడేవాళ్ళం..ఆ బాధలో నుండి పుట్టిందే బ్లడ్ బ్యాంకు..1999 వ సంవత్సరం లో ఈ బ్లడ్ బ్యాంకు చిరంజీవి గారు స్థాపించారు..ఎన్నో వేల కుటుంబాలను కాపాడింది ఈ బ్లడ్ బ్యాంక్..నాన్న గారు తన తో ఫోటో దిగాలంటే కచ్చితంగా రక్త దానం చెయ్యాలి అని ఫ్యాన్స్ కి చెప్పారు..అలా నాన్న రక్త దానం చేసిన ఎన్నో వేలమంది అభిమానులతో ఫోటోలు తీసుకున్నారు’ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు రామ్ చరణ్.