https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Adireddy : 15 లక్షలు లేవు ఏం లేవు.. ఆదిరెడ్డికి రూపాయి దక్కలే.. ఎలిమినేటెడ్

Bigg Boss 6 Telugu Adireddy : బిగ్ బాస్ ఫైనల్ యమ రంజుగా సాగుతోంది. విజేత ఎవరు అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మీడియాలో అనుకున్నట్టు ఎలిమినేషన్ జరగడం లేదు. దీంతో బిగ్ బాస్ విజేత ఎవరన్న దానిపై కూడా ఉత్కంఠం రేపుతోంది. టాప్ 5లో టాప్ 3లో ఆదిరెడ్డి ఉంటాడని అనుకున్నా అది సాధ్యం కాలేదు. ఇలా ఊహకందకుండా బిగ్ బాస్ జరుగుతోంది. అందరూ రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2022 / 09:15 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Adireddy : బిగ్ బాస్ ఫైనల్ యమ రంజుగా సాగుతోంది. విజేత ఎవరు అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మీడియాలో అనుకున్నట్టు ఎలిమినేషన్ జరగడం లేదు. దీంతో బిగ్ బాస్ విజేత ఎవరన్న దానిపై కూడా ఉత్కంఠం రేపుతోంది. టాప్ 5లో టాప్ 3లో ఆదిరెడ్డి ఉంటాడని అనుకున్నా అది సాధ్యం కాలేదు. ఇలా ఊహకందకుండా బిగ్ బాస్ జరుగుతోంది.

    అందరూ రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఇక అందరి కంటే ముందు ఎలిమినేట్ అయిపోయేది కీర్తి అని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా అది జరగలేదు. రోహిత్ టాప్ 3లో ఉంటాడని భావించారు. సామాన్యుడు ఆదిరెడ్డి టాప్ 3 అన్నారు. అది కూడా కాదని తాజా ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది.

    బిగ్ బాస్ లో తొలి ఎలిమినేషన్ రోహిత్ కాగా.. రెండో ఎలిమినేషన్ గా సామాన్యుడు ఆదిరెడ్డి కావడం ఆశ్చర్యపరిచింది. నిజానికి కీర్తి టాప్ 4గా ఎలిమినేట్ అవుతుందని.. టాప్ 3గా రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఉంటారని అనుకున్నారు. ఆదిరెడ్డి హౌస్ లోకి వచ్చిన 15 లక్షల సూట్ కేసును తీసుకొని వెళ్లిపోయాడని కూడా ప్రచారం సాగింది. మీడియాలో , సోషల్ మీడియాలో ఇదే హోరెత్తించారు.

    కానీ ఈ సీజన్ లో ప్రేక్షకులు ఊహించింది ఏదీ జరగడం లేదు. ఊహకందకుండా ఎలిమినేషన్ జరుగుతున్నాయి.

    టాప్ 5లో 5వ నెంబర్ గా తొలి ఎలిమినేషన్ రోహిత్ అయ్యాడు. రోహిత్ ను హీరో నిఖిల్ ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చాడు. ఇక ఆ తర్వాత టాప్ 4 ఎలిమినేటర్ గా ఆదిరెడ్డి అయ్యాడు. రవితేజ-శ్రీలీల చేతుల మీదుగా ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోయాడు.

    ఆది రెడ్డి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ 15 లక్షలు తీసుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ అనుకున్నట్టు రూపాయి కూడా ఆదిరెడ్డికి దక్కలేదు. టాప్ 4గా ఆదిరెడ్డి ఎలిమినేట్ కావడంతో ఆ స్తానానికి బిగ్ బాస్ సూట్ కేసు డబ్బుల ఆఫర్ ఇవ్వలేదు.

    ఇక ఆదిరెడ్డి కంటే ముందు టాప్ 3లో రేవంత్, శ్రీహాన్, కీర్తి ఉన్నారు. వీరి ముగ్గురికి సూట్ కేసు డబ్బులు ఆఫర్ గా బిగ్ బాస్ ఇచ్చాడు. రవితేజ డబ్బులు తీసుకొచ్చి కీర్తిని బయటకు తీసుకెళ్లారు.