Faima- Adi Reddy And Raj: బిగ్ బాస్ హౌస్ లో ఈ వీకెండ్ జరగబొయ్యే ఎలిమినేషన్స్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది..ఈ ఎలిమినేషన్ కి ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ కీ రోల్ పోషించబోతుంది..ఆది రెడ్డి ఓవర్ కాంఫిడెన్స్ తో ఈ పాస్ నాకు అక్కర్లేదు అని భారీ డైలాగ్ కొట్టి ఆ టాస్కు ని ఆడకుండా తప్పించేసుకున్నాడు..దీనితో ఆడియన్స్ కూడా ఈ వారం అతనిని లైట్ తీసుకున్నట్టు సమాచారం..మొదటి ఎపిసోడ్ నుండి టాస్కుల పరంగా అద్భుతంగా ఆడుతూ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎదిగిన ఆది రెడ్డి.

తన ఓవర్ కాంఫిడెన్స్ వల్ల ఈ వారం డేంజర్ జోన్ లోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది..ఈ వారం నామినేటైనా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో చివరి మూడు స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్స్ రాజ్, ఆది రెడ్డి మరియు ఫైమా..ఆది రెడ్డి మరియు రాజ్ కి ఫైమా కంటే ఎక్కువ ఓట్లతో ఆధిక్యం లో కొనసాగుతున్నప్పటికీ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వక తప్పేటట్టులేదు.

గత వారం లో జరిగిన ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ టాస్కు లో ఫైమా గెలుపొందింది..ఏవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఉన్న ఉపయోగాలు మనకి తెలిసిందే..ఈ పాస్ ని ఉపయోగించుకొని తమని తాము సేఫ్ చేసుకోవచ్చు మరియు తమకి ఇష్టమైన ఇంటిసబ్యులను కూడా సేఫ్ చెయ్యొచ్చు..ఫైమా కి హౌస్ లో ఆది రెడ్డి మరియు రాజ్ ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్..ఈ పాస్ ని ఉపయోగించి ఎవరినో ఒకరిని ఆమె సేవ్ చెయ్యొచ్చు.

కానీ ఈ వారం ఆమె నామినేషన్స్ లో ఉండడమే కాకుండా అందరికంటే తక్కువ ఓట్లతో చివరి స్థానం లో కొనసాగుతుంది..కాబట్టి ఈ వారం ఆమె ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ని తనకి తానూ ఉపయోగించుకొని ఎలిమినేషన్ నుండి తప్పించుకోబోతుంది..రాబొయ్యే రోజుల్లో ఆమె బాగా ఆది తన గ్రాఫ్ ని పెంచుకొని వీకెండ్ లో అందరికంటే ముందుగా సేఫ్ అయితే మాత్రం ఆది రెడ్డి మరియు రాజ్ లలో ఎవరికో ఒకరికి ఆ పాస్ ని ఉపయోగించి ఎలిమినేషన్స్ నుండి సేఫ్ చెయ్యొచ్చు..అలా ఆది రెడ్డి – రాజ్ బిగ్ బాస్ జర్నీ ఫైమా ఆట తీరు మీద ఆధారపడుంది అన్నమాట..చూడాలి ఈ వీకెండ్ ఏమి జరగబోతుందో అనేది.