Unstoppable With NBK Pawan Kalyan-Jagan: ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 2 ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ సక్సెస్ వైపు ముందుకు దూసుకుపోతుంది..గత సీజన్ లో మన టాలీవుడ్ నుండి స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడే ముఖ్య అతిధి గా ఈ టాక్ షో కి హాజరయ్యాడు..కానీ ఈ సీజన్ లో ఇప్పటికే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హాజరవ్వగా..త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు.

ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే విడుదల చేసారు..డిసెంబర్ 30 వ తేదీన ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది..ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ ఈ నెల 27 వ తారీఖున షూట్ చెయ్యబోతున్నారు..ఈ ఎపిసోడ్ కోసం కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఈ సీజన్ కి ఇదే చివరి ఎపిసోడ్ గా నిలవబోతుంది..పవన్ కళ్యాణ్ తో పాటుగా త్రివిక్రమ్ మరియు క్రిష్ కూడా ఈ షో కి హాజరు కాబోతున్నారు.
ఇది ఇలా ఉండగా మరో షాకింగ్ ట్విస్ట్ ఈ షో ద్వారా ఇవ్వబోతున్నారట బాలయ్య బాబు..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ని కూడా ఇదే ఎపిసోడ్ కి పిలిచాడట బాలయ్య బాబు..రాజకీయ అరంగేట్రం చేయకముందు జగన్ బాలయ్య బాబు కి వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే..కడప జిల్లా బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కూడా జగన్ అప్పట్లో పని చేసాడు..రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా బాలయ్య బాబు ని ఇంత వరుకు జగన్ విమర్శించడం ఎప్పుడూ చూడలేదు..మొన్న కృష్ణ భౌతిక కాయాన్ని దర్శించుకోడానికి జగన్ వచ్చినప్పుడు బాలయ్య బాబు కూడా అక్కడే ఉన్నాడు..జగన్ కాసేపు ఆయనతో ముచ్చటించారు కూడా.

ఆ చనువు తోనే బాలయ్య బాబు జగన్ ని పిలిచాడని..జగన్ కూడా అందుకు ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..పవన్ కళ్యాణ్ మరియు జగన్ ని ఒకే వేదిక పై కూర్చోపెట్టి రాజకీయాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగబోతున్నారని తెలుస్తుంది..చరిత్రలో ఎన్నడూ సంభవించని ఈ సంచలనాత్మక ఎపిసోడ్ డిజిటల్ మీడియా లో సరికొత్త ప్రభంజనం సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.