Bigg Boss Sohel: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చాడు. నా ఫ్యామిలీ జోలికి వస్తే వెతికి మరీ తంతా అన్ని సీరియస్ కామెంట్స్ చేశాడు. సోహెల్ అలా రియాక్ట్ కావడం వెనుక కారణం పరిశీలిస్తే…. బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ రన్నర్ అయిన సోహెల్, ఒక అపవాదు మోశాడు. సోహెల్, అభిజీత్, అఖిల్ టాప్ 3 కంటెస్టెంట్స్ గా ఉన్న సమయంలో నాగార్జున రూ. 10 లక్షలు ఆఫర్ చేశారు. టైటిల్ గెలవలేమని నమ్మిన వాళ్ళు రూ. 10 లక్షలు తీసుకొని రేసు నుండి తప్పుకోవచ్చని ఆఫర్ ప్రకటించారు. కాసేపు ఆలోచించిన సోహెల్ ఆఫర్ కి ఓకే చెప్పి సూట్ కేసు తీసుకొని హౌసు నుండి బయటకు వచ్చాడు.

సోహెల్ ఆ డబ్బు మిత్రుడు మెహబూబ్ కోసం తీసుకున్నాను. అతని ఇంటి నిర్మాణానికి ఇస్తాను అన్నాడు. సోహెల్ మంచి మనసుకు మెచ్చి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి మరో పది లక్షలు ప్రకటించారు. మొత్తంగా రూ. 25 లక్షలు సెకండ్ రన్నర్ గా సోహెల్ గెలుచుకున్నాడు. అయితే సోహెల్ టైటిల్ గెలవడని అతనికి ముందే తెలుసు, హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ అతనికి హింట్ ఇచ్చాడన్న ప్రచారం జరిగింది.
ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని ఫైనల్ కి ముందు హౌస్లోకి పంపారు. కరోనా ప్రొటెక్షన్ కోసం నేరుగా కలవనీయకుండా మధ్యలో గ్లాస్ ఏర్పాటు చేశారు. సోహెల్ తో మాట్లాడేటప్పుడు మెహబూబ్ అనుమాస్పద సైగలు చేశాడని, మూడు వేళ్ళు చూపి తన పొజీషన్ లీక్ చేశాడని, అందుకే సోహెల్ ఫైనల్ లో సూట్ కేసు తీసుకున్నాడన్న వాదన తెరపైకి వచ్చింది. ఇద్దరూ కలిసి స్కామ్ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలకు సోహెల్ సమాధానం చెప్పారు. అలాంటిదేమీ జరగలేదు, అంతా దుష్ప్రచారం అంటూ కొట్టిపారేశారు.

ఆ వివాదం మెల్లగా సద్దుమణిగింది. తాజాగా ఈ అంశాన్ని లేవనెత్తుతూ సోహెల్ ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో స్కామ్ చేశాడంటూ హేట్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లక్కీ లక్ష్మణ్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో సోహెల్ బరస్ట్ అయ్యారు. ”ఎవర్రా స్కామ్ చేసింది. నేనేమైనా దొంగతనం చేశానా?. ఆఫర్ చేసిన డబ్బులు తీసుకొని బయటకు వచ్చాను. రూ. 25 లక్షలు అంటే మా ఫ్యామిలీకి చాలా ఎక్కువ. ఎన్నో అవసరాలు ఉన్నాయి. డబ్బులు తీసుకున్నాను.
స్కామ్ అంటూ ట్రోల్ చేస్తే ఊరుకోను. నా ఫ్యామిలీ జోలికి వస్తే వెతికి మరీ తంతాను. సింగరేణి ముద్దుబిడ్డ అనే పేరు మా నాన్న వలెనే వచ్చింది. ఆయన బొగ్గు గనిలో పని చేస్తూ ఐదుగురు పిల్లలను పెంచాడు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. బిగ్ బాస్ డబ్బులతో నా చెల్లి పెళ్లి చేశాను, అని సోహెల్ తీవ్ర స్థాయిలో తన ట్రోలర్స్ పై మండిపడ్డాడు. బిగ్ బాస్ షోతో సోహెల్ కి హీరోగా ఆఫర్స్ వచ్చాయి. ఆయన లేటెస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ డిసెంబర్ 30న విడుదల కానుంది .