
Keerthy Suresh National Award: నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో నటనకి ప్రాధాన్యత ఇస్తున్న వాళ్ళు చాలా తక్కువ.ఎంత అందాలు ఆరబోస్తే, అన్ని అవకాశాలు వస్తాయి అనే భావన లో ఉన్న వాళ్ళే ఎక్కువ.అలా నడుస్తున్న ట్రెండ్ లో గ్లామర్ షో తో పాటుగా అద్భుతమైన అభినయం కనబర్చే హీరోయిన్స్ కూడా కొంతమంది ఉన్నారు.ఆ కొంతమందిలో ఒకరే కీర్తి సురేష్.’నేను శైలజ’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె , అతి తక్కువ సమయం లోనే స్టార్ గా ఎదిగింది.
ఆరోజుల్లో ఈమె నటన పై సోషల్ మీడియా లో కాస్త ట్రోలింగ్స్ నడిచేవి.కానీ ఎప్పుడైతే ‘మహానటి’ సినిమాలో నటించిందో, అప్పటి నుండి యాక్టింగ్ అంటే కీర్తి సురేష్ , కీర్తి సురేష్ అంటే యాక్టింగ్ అనే రేంజ్ ట్రేడ్ మార్కు ని ఏర్పర్చుకుంది.చనిపోయిన మహానటి సావిత్రి గారు దివి నుండి క్రిందకి దిగి వచ్చి వెండితెర మీద మరోసారి మెరిసింది అనిపించే రేంజ్ లో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది కీర్తి సురేష్.
అంత అద్భుతంగా నటించినందుకు గాను ఆమెకి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది.నేటి తరం హీరోయిన్స్ లో ఎవరికీ ఆ అదృష్టం దక్కలేదు.ఇప్పుడు మరోసారి ఆమె నేషనల్ అవార్డు గెలుచుకోనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దసరా’ కి సంబంధించిన సాంగ్స్ , మరియు వేసుకున్న గెటప్ ,ఇవన్నీ చూస్తూ ఉంటె మరోసారి నేషనల్ అవార్డు కొట్టడం ఖాయం అనిపిస్తుంది.

నటనకి ప్రాధాన్యం ఉన్న ఎలాంటి పాత్రలో అయినా హీరోలను సైతం డామినేట్ చేసే టాలెంట్ ఉన్న కీర్తి సురేష్,ఈ సినిమాలో కూడా అంతే అద్భుతంగా చేసిందని.ఆమె పోషించిన ‘వెన్నెల’ అనే పాత్ర కొన్ని ఏళ్ళ పాటు ప్రేక్షకులు మర్చిపోలేని రేంజ్ లో ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ సినిమా తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని నమ్మకం తో ఉన్నాడు.మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుంది లేదా అనేది తెలియాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.