Bigg Boss 7 : తెలుగు బుల్లితెర మీద బిగ్ బాస్ సందడి మరోసారి మొదలు కాబోతుంది. ఇప్పటికే వరుసగా 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకున్న ఈ బిగ్ ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో 7 వ సీజన్ కు సిద్ధం అవుతుంది. అయితే గత సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ సీజన్ ను ఎలాగైనా సూపర్ సక్సెస్ చేయాలనీ స్టార్ మా టీం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇందుకోసం హౌస్ లోకి పంపించడానికి మంచి కంటెస్టెంట్స్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
బిగ్ బాస్ షో అంటే రసవత్తరమైన డ్రామా తో పాటుగా తమ అందంతో చిత్తూ చేసే అందమైన అమ్మాయిలు ఈ షో లో ప్రధాన ఆకర్షణ. దీంతో ఈ సీజన్ లో అలాంటి భామలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. వస్తున్నా సమాచారం ప్రకారం ఇప్పటికే ఆరుగురిని ఇందుకోసం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తున్నది. ఓ బేబీ సినిమాతో మంచి హిట్ అందుకున్న సీరియల్ యాక్ట్రస్ విష్ణుప్రియ బిబి 7లో అడుగుపెడుతున్నారట. అలాగే తెలుగు సీరియల్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నవ్య స్వామి ఎంట్రీ ఇస్తున్నారు.
కార్తీకదీపం సీరియల్ లో మౌనితగా విలన్ రోల్ ప్లే చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న శోభ శెట్టి, యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ కమ్ యాక్టర్ విష్ణుప్రియ, టాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సురేఖ వాణి, టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న దీపిక పిల్లి కూడా ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెడుతున్నారట. వీరితో పాటుగా సింగర్ మోహన భోగరాజు, టీవీ యాక్టర్ ప్రభాకర్, దుర్గారావు దంపతులతో పాటు ఆట షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ – జ్యోతి జంట కూడా కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బిగ్ బాస్ 7 కి సంబంధించిన ఒక చిన్న ప్రోమో కూడా విడుదల చేసి షో మీద ఆసక్తిని రేకెత్తించారు. 7వ సీజన్ దాదాపు 4 నెలలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో లో బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన సెట్స్ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. గత సీజన్స్ తో పోల్చి చూస్తే ఈ సారి కొత్తగా మరింత ఆసక్తి గా ఉండబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.