Union Budget 2023 Telangana: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యే మిగిలింది.. బడ్జెట్ కి ముందు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలు మొత్తం బుట్ట దాఖలు అయ్యాయి.. ఆర్థిక మంత్రి నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలకు బడ్జెట్లో స్థానం దక్కలేదు.. పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా అందే నిధులు మినహా రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ.. మంత్రులు ఎన్నో లేఖలు రాసినప్పటికీ.. ఇలాంటి ప్రత్యేక ఊరట లభించలేదు.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆనాటి హామీల అమలుతో పాటు రాష్ట్రానికి రావలసిన బకాయిలు ఇవ్వాలని.. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ప్రత్యేక తోడ్పాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినప్పటికీ ఫలితం దక్కలేదు.

హైదరాబాద్ మెట్రో కు నిధులు ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి లేఖ రాశారు. కానీ దానిని కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు 8,453 కోట్లు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు.. బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ప్రస్థానం లేకుండా పోయింది.. భగీరథ పథకానికి 19205 కోట్లు, మిషన్ కాకతీయకు 5000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ప్రత్యేక తోడ్పాటు కూడా రాష్ట్రానికి కరువైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ ప్రాంతానికి ప్రతి ఏటా 2362 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.. కానీ దానిని కూడా కేంద్రం బుట్ట దాఖలు చేసింది.
కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. బి ఆర్ జి ఎఫ్ కు సంబంధించి తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు 2019_20 నుంచి ఇవ్వాల్సిన 1350 కోట్ల బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ విడతలు గాలికి కొట్టుకుపోయాయి. హైదరాబాద్ మెట్రో తో పాటు, వరంగల్ నియో మెట్రో కు నిధులు ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.. తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటాగా వచ్చే 21, 470 కోట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. ఐఐఎం సహా వివిధ సంస్థలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ పెద్దగా ప్రయోజనం దక్కలేదు.

ఆశించిన మేరకు కేటాయింపులు దక్కలేదు కానీ.. కేంద్రం కంటి తుడుపుగా సంస్థలకు నిధులు ఇచ్చింది.. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి 47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి 168 కోట్లు కేటాయించింది.. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు 37 కోట్లు ప్రకటించింది.. సింగరేణికి 1650 కోట్లు, ఐఐటి హైదరాబాద్ కు ఈఏపీ కింద మూడు వందల కోట్లు ఇచ్చింది.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 683 కోట్ల చొప్పున నరేంద్ర మోడీ సర్కార్ ప్రతిపాదించింది.. మంగళగిరి, బీబీనగర్ ఎయిమ్స్ తో పాటు దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు 6,835 కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్రం బడ్జెట్లో తెలిపింది.. హైదరాబాదులోని సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియం లకు 357 కోట్లు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మణుగూరు, కోట ప్రజల కేంద్రాలకు 1473 కోట్లు ఇవ్వనట్టు కేంద్ర ప్రకటించింది.. ఇక కేంద్రం పన్నుల్లో ఆంధ్ర ప్రదేశ్ వాటా 41, 388 కోట్లు, తెలంగాణ వాటా 21, 470 కోట్లు ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులు జరగలేదనేది తెలుస్తోంది.