Snakes Flying in the Wind : సాధారణంగా ఎగిరే పక్షులను చూస్తుంటాం. అది వాటి సహజత్వం. కానీ ఎగిరే పాములను మాత్రం ఇదివరకు చూడలేదు. ఇది ఆశ్చర్యపరచే విషయమే. పాములు గాల్లో తేలుతూ కనిపిస్తే భయమే. సహజంగా పాములను చూస్తేనే భయం కలుగుతుంది. అలాంటిది గాల్లో ఎగిరితే ఇక అంతే సంగతి. ఈ నేపథ్యలో గాల్లో ఎగురుతున్న పాముల గురించి మనకు తెలియకపోవడం గమనార్హం. ప్రపంచంలో చాలా వింతలు ఉంటాయని తెలుసు. కానీ ఇది కూడా ఓ వింతే.
ప్రస్తుతం పాములు గాల్లో ఎగురుతున్న వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. తన ఆహారం కోసం పాము పక్షిలా ఎగరడం వింతే. దీంతో దీన్ని ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. పాములు కూడా ఎగురుతాయా అని నోరెళ్లబెడుతున్నారు. తన ఎర కోసం పాము ఏకంగా పక్షిలా మారి దాన్ని నోట కరుచుకునేందుకు పడే తపనను ప్రత్యక్షంగా కళ్లకు కడుతోంది.
ఎగిరే పామును బంగారు చెట్టు పాము అంటారు. ఇది విషపూరితమైన పాము. ఎక్కువగా దక్షిణాసియా, ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. ఇవి నలుపు క్రాస్ చారలు కలిగి పసుపు, ఎరుపు భాగాలతో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని శరీరం సన్నగా పొలుసులతో కలిగి ఉంటుంది. కుంచించుకుపోయిన మెడ, మొద్దుబారిన ముక్కు, పెద్ద కళ్లు, తల కలిగి ఉంటుంది. ఈ పాము తన నోటి వెనుక భాగంలోని కోరల నుంచి విషంతో కలిపిన తేలికపాటి లాలాజలాన్ని స్రవించడం ద్వారా ఎరను పట్టుకుని కదలనీయకుండా చేస్తుంది.
ఇంటర్నెట్ లో దీనికి సంబంధించిన వీడియో అందరిని ఎంతో ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 11.5 అడుగుల పొడవున్న ఎగిరే పామును చూసి అందరు మురిసిపోతున్నారు. ఏంటీ విడ్డూరమని నోళ్లు వెళ్లబెడుతున్నారు. పాము పక్షిలా ఎగరడంతో అందరు తదేకంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో దీనికి సంబంధించిన వీడియోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఎగిరే పక్షులను చూసినా పాములను మాత్రం ఇంతవరకు చూడలేదు. ఈ నేపథ్యంలో కలియుగ వింతల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెటిజన్లకు పండగ చేస్తున్నాయి. వాటిని చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎగిరే పాము తీరుకు మురిసిపోతున్నారు. అదే సమయంలో భయం కూడా వ్యక్తం చేస్తున్నారు.