Homeట్రెండింగ్ న్యూస్BOB SO Notification 2025 : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌.. అర్హతలు, ముఖ్యమైన...

BOB SO Notification 2025 : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌.. అర్హతలు, ముఖ్యమైన తేదీలు ఇవే..

BOB SO Notification 2025 : ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ప్రైవేటు కంపెనీలబాట పడుతున్నారు. తక్కువ వేతనం, భద్రతలేని ఉద్యోగాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బ్యాంకు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగలకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(Bank Of Baroda) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,267 రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రూరల్‌ అండ్‌ అగ్రి బ్యాంకింగ్, రిటైల్‌ లియేబిలిటీస్, ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్, ఇన్‌ఫర్షేన్‌ సెక్యూరిటీ, షెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేషన్‌ అండ్‌ ఇనిస్టిట్యూషనల్‌ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎంటర్‌ ప్రైజెస్‌ డేటా మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 28 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 2025, జనవరి 17 వరకు చివరి తేదీ ఉంది. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టులు ఇవే..
అగ్రిక్లచర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ మేనేజర్, మేనేజర్‌–సేల్స్, మేనేజర్‌ క్రెడిట్‌ అనలిస్ట్, సీనియర్‌ మేనేజర్‌–క్రెడిట్‌ అనలిస్ట్, సీనియర్‌ మేనేజర్‌ –ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్, హెడ్‌–ఎస్‌ఎంఈ సెల్, ఆఫీసర్‌–సెక్యూరిటీ అనలిస్ట్, మేనేజర్‌–సెక్యూరిటీ అలనిస్ట్, సీనియర్‌ మేనేజర్‌–సెక్యూరిటీ అనలిస్ట్, టెక్నికల్‌ ఆఫీసర్‌ సివిల్‌ ఇంజినీర్, టెక్నికల్‌ మేనేజర్‌–సివిల్‌ ఇంజినీర్, టెక్నికల్‌ సీనియర్‌ మేనేజనర్‌–సివిల్‌ ఇంజినీర్, టెక్నికల్‌ సీనియర్‌ మేనేజర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్, టెక్నికల్‌ మేనేజర్‌ ఆర్కిటెక్ట్, సీనియర్‌ మేనేజర్‌–సీఅండ్‌ఐసీ రిలేషన్‌షిప్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌–సీఅండ్‌ ఐసీ రిలేషన్‌షిప్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌–సీఅండ్‌ఐసీ క్రెడిట్‌ అనలిస్ట్‌ తదితర పోస్టులు ఉన్నాయి.

ఇతర సమాచారం..
బీవోబీ ఉద్యోగ నోటిపికేషన్‌కు సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అందులో..

అర్హతలు: బ్యాంకు ఉద్యోగాలకు దరకాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీహెచ్డీ, సీఏ/సీఎంఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.

ఎంపిక ఇలా..
ఉద్యోగాల భర్తీకి సంబందించి ఎంపిక ఆన్‌లైన్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితర అంశాల ఆధారందగా జరుగుతుంది.

పరీక్ష విధానం..
ఇక రాత పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్‌(25 ప్రశ్నలు–25 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(25 ప్రశ్నలు–25 మార్కులు), క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌(25 ప్రశ్నలు – 25 మార్కులు), ప్రొఫెషనల్‌ నాలెడ్డ్‌(75 ప్రశ్నలు–150 మార్కులు) ఉంటంది. పరీక్ష సమయం 2:30 గంటలు ఉంటుంది. పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో కేంద్రాలు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీలు రూ.600 ఫీజు చెల్లించాలి, ట్యాక్సులు అదనం. ఇక ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు రూ.100 చెల్లించాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular