Balayya : 1974లో తెలుగు చిత్రపరిశ్రమలోకి నందమూరి బాలకృష్ణ అడుగుపెట్టారు. ఇప్పటివరకు ఆయన 110 సినిమాల్లో నటించారు. అఖండ సినిమా నుంచి ఆయన నటించిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. అఖండ, భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, తాజాగా డాకు మహారాజ్.. ఇలా వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన అఖండ -2 లో నటిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలుగాను బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ పురస్కారాన్ని ఆయన సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. పురస్కారాన్ని గ్రహించే సమయంలో నందమూరి బాలకృష్ణ పూర్తిగా తెలుగు సంప్రదాయాన్ని పాటించారు. దోవతి, దానికి తగ్గట్టుగా కుర్తా ధరించి ఆకట్టుకున్నారు. తెలుగు సంప్రదాయాన్ని ఫరిడవిల్లేలా చేశారు.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
హిందీలో బాలకృష్ణ పరిచయం
పద్మశ్రీ పురస్కారం అందుకున్న తర్వాత బాలకృష్ణ ఢిల్లీలోని జాతీయ మీడియా తో మాట్లాడారు..” నా పేరు బాలకృష్ణ. నందమూరి మా ఇంటి పేరు. మా నాన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు.. ఆయన కుమారుడిని నేను. పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకోవడానికి నేను ఢిల్లీ వచ్చాను. నేను దాదాపు 110 సినిమాలలో నటించాను. నేను నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను చాలా ఎక్కువ మంది చూశారు. నేను 1974లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టానని” బాలకృష్ణ హిందీలో వ్యాఖ్యానించారు. సహజంగా బాలకృష్ణ సంపూర్ణమైన తెలుగులో మాట్లాడుతుంటారు. అవసరమైతే తప్ప ఇంగ్లీషు పదాన్ని వాడరు. పైగా బాలకృష్ణకు తెలుగు మీద విపరీతమైన పట్టు ఉంటుంది. అందువల్లే ఆయన మాట్లాడే మాటలు పూర్వకాలపు భాష ధ్వనిస్తుంది. ఇక హిందీపై బాలకృష్ణకు పట్టు బాగానే ఉంటుంది. గతంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా టిడిపి నిర్వహించిన సభల్లో బాలకృష్ణ మాట్లాడిన హిందీ నవ్వులు పూయించింది. అంతేకాదు 2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బాలకృష్ణ ప్రచారం చేశారు. అప్పుడు “సారే జహాసే అచ్చా.. హిందుస్థాన్ హమారా.. హే బుల్ బుల్” అంటూ బాలకృష్ణ వచ్చిరాని హిందీలో మాట్లాడి అప్పుడు కూడా నవ్వులు పూయించారు. ఇక ఇప్పుడు హిందీలో మాట్లాడినప్పటికీ.. ఏమాత్రం తత్తర పాటు కు బాలకృష్ణ అవకాశం ఇవ్వలేదు. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేసి వెళ్లిపోయారు. అయితే మధ్యలో కాస్త ఆయన మాటలకు బ్రేక్ పడినప్పటికీ.. దానిని ఆయన ఈజీగానే కవర్ చేశారు. మొత్తంగా తనకు కూడా హిందీ వచ్చు అనే నిరూపించుకున్నారు.. ఇక బాలకృష్ణ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను కొంతమంది ట్రోలర్స్ సామాజిక మాధ్యమాలలో తెగ వ్యాప్తి చెందిస్తున్నారు. ఇదే క్రమంలో ఆ వీడియోకు తమదైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
Tell me about yourself
NBK :pic.twitter.com/AaB1K01uhS
— Joker (@JokerSpeakz) April 29, 2025