
Tarakaratna Peddakharma: నందమూరి తారకరత్న చనిపోయి అప్పుడే 12 రోజులు గడిచిపోయాయి.నేడు నందమూరి కుటుంబ సభ్యుల మధ్య ఆయన పెద్ద కర్మ కూడా జరిగిపోయింది.నందమూరి అభిమానులు ఇప్పటికీ ఈ విషాదం నుండి బయటపడలేదు కానీ, తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఏడవని రోజు అంటూ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.సోషల్ మీడియా లోని ఇంస్టాగ్రామ్ లో ఆమెకి ఒక అధికారిక అకౌంట్ ఉంది.
అందులో నుండి ఆమె ప్రతీరోజు తారకరత్న ని తలచుకొని బాధపడుతూ వేసే పోస్టులు అభిమానుల చేత కంటతడి పెట్టించేలా చేస్తుంది.ఇక ఈరోజు పెద్ద కర్మ లో కూడా ఆమె తారకరత్న ఫోటోని చూస్తూ ఏడ్చేసింది.ఆ దృశ్యాలను చూస్తే ఎలాంటి వాడికైనా కనీళ్ళు వచ్చేస్తాయి.ఈ పెద్ద కర్మ కి నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా, టాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే పెద్ద కర్మ లో పాల్గొనేందుకు గాను ఆయన #RRR అంతర్జాతీయ అవార్డ్స్ ఫంక్షన్స్ కి కూడా హాజరు కాలేదు.
ఈరోజు ఆయన తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి తారకరత్న పెద్దకర్మ కి హాజరయ్యారు.అయితే ఇక్కడ బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ పట్ల ప్రవర్తించిన తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి తో ఉన్నారు.బాలయ్య తమవైపు వస్తున్న వీళ్లిద్దరు ఆయనకీ గౌరవిస్తూ పైకి లేచారు.కానీ బాలయ్య మాత్రం పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.అంతే కాదు ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ని బాలయ్య పలకరించలేదట.ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

ఇలా ఎన్ని సార్లు అవమానం కి గురి అవుతావు అన్న, నువ్వు కూడా బాలయ్య ని పట్టించుకోకు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆయనని ట్యాగ్ చేసి చెప్తున్నారు.ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ ఈ నెల నాల్గవ తేదీన అమెరికాకి పయనం అవుతున్నాడు.అక్కడ 12 వ తేదీన జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి ఆయన హాజరు కాబోతున్నాడు.