
Balakrishna- Taraka Ratna: నందమూరి బాలకృష్ణ పైకి కఠువుగానే కనిపిస్తాడు కానీ మనసు వెన్న లాంటిది అని ఆయనని దగ్గర నుండి చూసే ప్రతీ ఒక్కరు చెప్పే మాట.తన తల్లితండ్రుల పేరు మీద ఎంతో మందికి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించిన మహానుభావుడు ఆయన.రీసెంట్ గానే అయన హిందూపురం లో ఒక హాస్పిటల్ ని నిర్మించాడు.ఇటీవలే గుండెపోటు తో చనిపోయిన తారకరత్న కి గుర్తు గా , పేద ప్రజల కోసం బాలయ్య బాబు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.
గుండె కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తాము అంటూ బాలయ్య పేర్కొన్నారు.ఇది తన బిడ్డ తారకరత్న కి గుర్తు గా చేస్తున్న కార్యక్రమం అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య.తారకరత్న లాగ భవిష్యత్తులో ఎవ్వరూ చనిపోకూడదు, ముఖ్యంగా పేదలు, వారికోసం చికిత్సకి అవసరం అయ్యే ప్రతీ ఒక్కటి కూడా ఉచితంగా అందజేస్తాము అంటూ బాలయ్య ఈ సందర్భంగా తెలిపాడు.

అంతే కాదు హాస్పిటల్ లో H బ్లాక్ ని తారకరత్న బ్లాక్ గా నామకరణం చేస్తున్నాము అంటూ ఈ సందర్భంగా బాలయ్య బాబు తెలిపాడు.పేదలకు అక్కడే ఉచితంగా చికిత్స చెయ్యబడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపాడు.తన అబ్బాయి మీద బాలయ్య చూపిస్తున్న ప్రేమని చూసి నందమూరి అభిమానులు ఆనందం తో కంటతడి పెట్టుకున్నారు.ఇలాంటి దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలంటూ అభిమానులు ఈ సందర్భంగా సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.తారకరత్న హాస్పిటల్ లో ఉన్నంత కాలం బాలయ్య బాబు ఎంతలా భయపడ్డాడో, తారకరత్న కోసం ఎంతలా పరితపించాడో అంత తేలికగా ఎవరు మాత్రం మర్చిపోగలరు.
తన సొంత కొడుకు హాస్పిటల్ పాలైతే ఎంతలా మనం పరితపించి పోతామో, బాలయ్య బాబు అంతకు మించి తారకరత్న ప్రాణాలను కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు.అవన్నీ విఫలం అయ్యి తిరిగి రాని లోకాలకు తారకరత్న పయనమవ్వడం దురదృష్టకరం.ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.