https://oktelugu.com/

Veera Simha Reddy Review: ‘వీర సింహా రెడ్డి’ ఫుల్ మూవీ రివ్యూ

Veera Simha Reddy Review: నటీనటులు : నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ , వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ,హనీ రోజ్ డైరెక్టర్ : గోపీచంద్ మలినేని మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.థమన్ సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్ అఖండ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ..క్రాక్ వంటి సూపర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 12, 2023 / 08:15 AM IST
    Follow us on

    Veera Simha Reddy Review: నటీనటులు : నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ , వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ,హనీ రోజ్

    balakrishna

    డైరెక్టర్ : గోపీచంద్ మలినేని
    మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.థమన్
    సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ
    బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్

    అఖండ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ..క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాపై కేవలం నందమూరి అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..అందుకు సాక్ష్యం అడ్వాన్స్ బుకింగ్స్..బాలయ్య సినిమాకి గడిచిన రెండు దశాబ్దాలలో ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ అనేది ఎప్పుడు జరగలేదు..మరీ ముఖ్యంగా నైజాం ప్రాంతం లో..ఒకప్పుడు ఇక్కడ బాలయ్య సినిమాలకు అసలు డిమాండ్ ఉండేది కాదు..కానీ మొట్టమొదటిసారి నైజాం ప్రాంతం లో కూడా ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్ కొట్టబోతుంది..ఇక బాలయ్య కి స్ట్రాంగ్ జోన్స్ గా చెప్పుకునే సీడెడ్ మరియు ఆంధ్ర ప్రాంతాలలో ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

    కథ :

    బాలసింహా రెడ్డి (బాలకృష్ణ ) ఫారిన్ లో ఒక బ్యాంకు మ్యానేజర్ గా పనిచేస్తుంటాడు..అతని కొలిక్ గా శృతి హాసన్ ఉంటుంది..బాలకృష్ణ తండ్రి వీర సింహా రెడ్డి (రెండో బాలకృష్ణ) ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్..సీమ లో శాంతికి విఘాతం కలిగితే అసలు సహించడు..తన కంఠం లో ప్రాణం ఉండగా సీమలో ఎవరిని కత్తి పట్టకుండా ఉండేందుకు తానూ కత్తి పడుతాడు..విలన్స్ చేసే ప్రతీ దుశ్చర్యలను నాశనం చేస్తూ వాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు..ప్రతీ విషయం కి అడ్డు వస్తున్నాడని విలన్ వీర సింహా రెడ్డి కి వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు..ఇదంతా తన తల్లి ద్వారా తెలుసుకున్న బాల సింహా రెడ్డి సీమ కి వచ్చి విలన్ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు..స్టోరీ ఇదే.

    విశ్లేషణ :

    ఇలాంటి కథలు బాలయ్య గతం లో బోలెడన్ని చేసాడు..చూసే జనాలకు చాలా రొటీన్ అయిపోయాయి ఈ కథలు..కానీ బాలయ్య సినిమాకి కథతో అసలు అవసరం లేదు..కేవలం స్క్రీన్ ప్లే మీద శ్రద్ద పెడితే చాలు..బాక్స్ ఆఫీస్ బద్దలే..బోయపాటి శ్రీను బాలయ్య తో అదే చేస్తాడు..ఇది వరకు ఆయన బాలయ్య తో తీసిన ‘సింహా’ ,’లెజెండ్’ మరియు ‘అఖండ’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విస్ఫోటనాయాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే..ఈ సినిమాలలో కథ మామూలే..కేవలం స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ పెట్టి బాలయ్య ని అద్భుతంగా చూపించాడు..ఫలితాలు కూడా అలాగే వచ్చాయి..ఈ సినిమాలో కూడా డైరెక్టర్ గోపీచంద్ మలినేని అదే చేసాడు..బాలయ్య ని ఎంత పవర్ ఫుల్ చూపిస్తే అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతారో అంత పవర్ ఫుల్ గా చూపించాడు..స్క్రీన్ మీద బాలయ్య ని చూస్తున్నంతసేపు సింహాన్ని చూస్తున్నట్టే ఉంటుంది..బాలయ్య బాబు కి ఈ సినిమా ఒక ఫెస్టివల్ అనే చెప్పొచ్చు.

    balakrishna

    ఇక మిగిలిన వాళ్లకు యావరేజి గా అనిపిస్తుంది..ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చకపోవచ్చు..మితిమీరిన వయోలెన్స్ అందుకు కారణం..ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కూడా అద్భుతమైన నటన కనబర్చాడు..ఈ సినిమా తర్వాత ఆయనకీ టాలీవుడ్ లో టాప్ విలన్ గా ఎదిగే అవకాశం ఉంది..ఇక ఇందులో బాలయ్య బాబు కి చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది..రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది..ఇక ఈ సినిమా లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి..ఈ సినిమాకి ఆయువు పట్టు అదే..మామూలుగా ఉన్న సన్నివేశాలు కూడా థమన్ తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మరో లెవెల్ కి తీసుకెళ్లాడు..సినిమా చూసి బయటకి వచ్చిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేము.

    చివరి మాట : ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య మార్క్ మాస్ మూవీస్ ని ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బాగా నచుతుంది..కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా నచ్చదు.

    రేటింగ్ : 2.5/5