Veera Simha Reddy OTT: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ స్టేటస్ ని దక్కించుకున్న చిత్రం ‘వీర సింహా రెడ్డి’..అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఈ మూవీ పై విడుదలకు ముందు నుండే అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఉండేవి..ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా లేకపోయినప్పటికీ సంక్రాంతి సెలవులను మాత్రం సరిగా ఉపయోగించుకుంది ఈ సినిమా.

ఓపెనింగ్ డే కలెక్షన్స్ కూడా ట్రేడ్ కి పెద్ద షాక్..ఒకప్పుడు 30 కోట్ల రూపాయిల క్లోసింగ్ కలెక్షన్స్ కూడా పెట్టేంత మార్కెట్ లేని బాలయ్య కి ఇప్పుడు ఏకంగా మొదటి రోజే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని కొల్లగొట్టే స్టామినా వస్తుందని ఎవరు మాత్రం ఊహించి ఉంటారు చెప్పండి!, కానీ ఈ చిత్రానికి కేవలం ఓపెనింగ్స్ మరియు పండుగ సెలవుల్లో కలెక్షన్స్ తప్ప, ఇక రన్ అసలు ఉండదని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.
73 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఓవరాల్ గా కొన్ని ప్రాంతాలలో నష్టాలను కలిగించినప్ప్పటికీ అవి చాలా స్వల్పమే అనే చెప్పాలి..ఫైనల్ బ్రేక్ ఈవెన్ నెంబర్ దాటింది కాబట్టి ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్.

అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 21 వ తారీఖు నుండి ఓటీటీ లో విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని డిస్నీ + హాట్ స్టార్ సంస్థ భారీ రేట్స్ కి కొనుగోలు చేసింది..థియేటర్స్ లో పర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకోబోతుందో చూడాలి..ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు అనిల్ రావిపూడి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు రాబోతుంది.