Homeట్రెండింగ్ న్యూస్వైరల్ అవుతోన్న బాలయ్య ఫోటో !

వైరల్ అవుతోన్న బాలయ్య ఫోటో !

Balayya viral pic
నట సింహం నందమూరి బాలకృష్ణకి కోపం ఎక్కువ, అలాగే చిరాకు పరాకు కూడా ఆయనలో కాస్త ఎక్కువుగానే ఉంటాయి. ఐతే, బాలయ్యలో ఒక సరదా మనిషి కూడా ఉన్నాడు. పైగా బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం, అందుకే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ బాలయ్య బాబును ప్రత్యేకంగానే చూస్తారు. కానీ బాలయ్య మాత్రం తన మనస్తత్వం ప్రకారం చుట్టూ ఉన్నోళ్లు ఏమనుకుంటారు లాంటి పట్టింపులు కూడా పట్టించుకోరు. అందుకే ఎప్పుడు ఎలా ఉంటారో బాలయ్యకే తెలియదు. తనకి ఏది నచ్చితే.. అదే చేసుకుంటూ పోతారు. మరి ముఖ్యంగా చిన్న పిల్లలతో చిన్నవాడిగా మారిపోతారు బాలయ్య. పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళల్లో ఒకడిగా కలిసిపోతారు.

కాగా మొన్న హోళీ సందర్భంగా బాలయ్య హిందూపూర్ వెళ్లారట. అక్కడ తనను చూడటానికి వచ్చిన కార్యకర్తల పిల్లలను దగ్గరకు తీసుకుని వారితో కాసేపు సరదాగా ఆడుకున్నాడట. బాలయ్య పిల్లలతో సరదగా గడుపుతున్న సమయంలో అక్కడున్న ఒక అనుచరుడు ఆ ఫోటో తీసాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ఫొటోలో బాలయ్య తన కొత్త సినిమా గెటప్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. అన్నట్టు బాలయ్య తన మనవాళ్లతో కూడా ఇలాగే ఎప్పుడూ సరదాగా గడుపుతుంటాడు.

ఏది ఏమైనా బాలయ్య బాబు ఎప్పటికప్పుడు తన చిన్న పిల్లాడి మనసును చాటుకుంటునే ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య సినిమాకి ‘మోనార్క్’, ‘గాడ్ ఫాదర్’ టైటిల్స్ లో ఒక టైటిల్ ని ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా నుండి ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ లో బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో రెచ్చిపోయారు. ఫుల్ యాక్షన్ టోన్ లో బాలయ్యను చూసిన ఆయన అభిమానులను ఫుల్ గా ఎంజాయ్ చేశారట. అన్నట్టు ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version