Balakrishna Twitter : సీనియర్ హీరోలలో ప్రస్తుతం మహర్దశ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ ఎవరు అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే..చేస్తున్న సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతున్నాయి..ఇక బాలయ్య కెరీర్ అయిపోయింది అని అభిమానులు ఫీల్ అవుతున్న సమయం లో వాళ్లకి అఖండ మూవీ సక్సెస్ మాములు కిక్ ఇవ్వలేదనే చెప్పాలి..బోయపాటి శ్రీను దర్శకత్వం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే 70 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది.
కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమైన ఇలాంటి వసూళ్లు..62 ఏళ్ళ వయస్సు లో బాలయ్య బాబు కూడా అలాంటి వసూళ్లను కొల్లగొట్టడం ట్రేడ్ లో పెద్ద చర్చ కి దారి తీసింది..ఇక ఈ సినిమా తర్వాత ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆహా మీడియా లో చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో బాలయ్య బాబు క్రేజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది.
ముఖ్యంగా యూత్ లో బాలయ్య బాబు క్రేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది ఈ షో..ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని తో ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల కాబోతుంది..ఇది ఇలా ఉండగా నూతన సంవత్సరం నాడు బాలయ్య బాబు అభిమానులకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది..అదేమిటి అంటే జనవరి 1 వ తేదీన ఆయన ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట..యూత్ కి మరింత చేరువ అవ్వాలంటే ట్విట్టర్ వంటి మాధ్యమాలను ఉపయోగించుకోవాలని సన్నిహితులు చెప్పడం తో బాలయ్య బాబు ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇక ట్విట్టర్ లోకి వచ్చిన తర్వాత బాలయ్య బాబు ఎలా సందడి చేస్తాడో చూడాలి..బాలకృష్ణ కి సోషల్ మీడియా మాధ్యమం లో కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే ఆయన ఉన్నాడు..తన ఫేస్ బుక్ అకౌంట్ ని యాక్టీవ్ గానే వాడుతున్నాడు బాలయ్య బాబు..మరి ట్విట్టర్ లోకి వచ్చిన తర్వాత అంతే యాక్టీవ్ గా ఉంటాడా లేదా అనేది చూడాలి.