https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Balakrishna : బిగ్ బాస్ వేదికపై బాలయ్య… టీఆర్పీ బాక్సులు బద్దలేనా!

Bigg Boss 6 Telugu Balakrishna : తెలుగువారికి పెద్దగా పరిచయం లేని బిగ్ బాస్ రియాలిటీ షో భారీగా సక్సెస్ అయ్యింది. హిందీలో చాలా ఏళ్ల క్రితమే మొదలైన బిగ్ బాస్… 2017లో తెలుగులో స్టార్ట్ అయ్యింది. హాలీవుడ్ కి చెందిన బిగ్ బ్రదర్ షోని బిగ్ బాస్ షోగా ఇండియాలోకి తెచ్చారు. హిందీలో సూపర్ హిట్ కావడంతో దేశంలోని అన్ని ప్రధాన భాషలకు బిగ్ బాస్ షో వ్యాపించింది. ఎన్టీఆర్ హోస్ట్ గా సాగిన […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2022 / 08:21 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Balakrishna : తెలుగువారికి పెద్దగా పరిచయం లేని బిగ్ బాస్ రియాలిటీ షో భారీగా సక్సెస్ అయ్యింది. హిందీలో చాలా ఏళ్ల క్రితమే మొదలైన బిగ్ బాస్… 2017లో తెలుగులో స్టార్ట్ అయ్యింది. హాలీవుడ్ కి చెందిన బిగ్ బ్రదర్ షోని బిగ్ బాస్ షోగా ఇండియాలోకి తెచ్చారు. హిందీలో సూపర్ హిట్ కావడంతో దేశంలోని అన్ని ప్రధాన భాషలకు బిగ్ బాస్ షో వ్యాపించింది. ఎన్టీఆర్ హోస్ట్ గా సాగిన సీజన్ వన్ సూపర్ హిట్. పెద్దగా పరిచయం లేకపోయినా ఎన్టీఆర్ తన టాలెంట్ తో షోకి ఇమేజ్, ఆదరణ తెచ్చిపెట్టారు. ఎన్టీఆర్ సారథ్యంలో షో ఊహించని విజయం సాధించింది. దీంతో ఎన్టీఆర్ ని వదులుకునేందుకు నిర్వాహకులు ఇష్టపడలేదు. 
     
    కమిట్మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ షో చేయనని చెప్పారు. దీంతో నానికి ఛాన్స్ దొరికింది. నాని పర్వాలేదు అనిపించాడు. నాని కూడా నెక్స్ట్ సీజన్ బాధ్యతలు తీసుకోలేదు. ఆ క్రమంలో మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ గా చేసిన ఉన్న నాగార్జునను రంగంలోకి దించారు. నాగార్జున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా నడిపించారు. తాజా సీజన్ మాత్రం ప్లాప్ అని చెప్పాలి. లాంచింగ్ ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు షో లేచిందే లేదు. పూర్ టీఆర్పీ వస్తుంది. 
     
    ఇక డిసెంబర్ 18 ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే జరగనుంది. లాంచింగ్ ఎపిసోడ్ గట్టి షాక్ ఇవ్వగా ఫినాలే పకడ్బందీగా ప్లాన్ చేయాలి అనుకుంటున్నారట. నాగార్జున మీద వదిలేస్తే దెబ్బైపోతామని ఫిక్స్ అయ్యారట. క్రేజీ గెస్ట్ ని తేవడం ద్వారా ఫైనల్ ని భారీగా క్యాష్ చేసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారట. ఈ క్రమంలో బాలయ్య కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా బాలయ్యను  తీసుకు వస్తే షోకి ప్లస్  అవుతుందని  నమ్ముతున్నారట. బాలయ్యతో నిర్వాహకులు మాట్లాడటం, ఆయన ఓకే చేయడం జరిగిపోయాయి అంటున్నారు. 
     
    నిజంగా బాలయ్య బిగ్ బాస్ సీజన్ 6 గెస్ట్ హాజరైతే టీఆర్పీ బాక్సులు బద్దలై పోవడం ఖాయం. అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా బాలయ్య చేస్తున్న సంచలనాల గురించి తెలిసిందే. బిగ్ బాస్ ఫినాలే వేదికపైకి బాలకృష్ణ వస్తే తన ఎనర్జితో భారీ ఆదరణ తెస్తారు అనడంలో సందేహం లేదు. అయితే నాగార్జున-బాలకృష్ణకు పెద్దగా పడదు. వారు ఉత్తర దక్షిణ ధ్రువాలు. కాబట్టి బిగ్ బాస్ షో వేదికను పంచుకునేందుకు ఇష్టపడతారా? అనే సందేహం కలుగుతుంది. మరోవైపు అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్స్, ఎన్బీకే 108 షూట్స్ తో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. దీనిపై కొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.