https://oktelugu.com/

Balagam : ‘బలగం’ సింగర్ కి తీవ్ర అస్వస్థత..దయచేసి కాపాడండి అంటూ అభ్యర్థన!

Balagam : ఇటీవల కాలం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ సాధించిన చిత్రం ‘బలగం’.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు,ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కథ.డైరెక్టర్ వేణు ఎంచుకున్న స్టోరీ , ఆయన తీసిన విధానం సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.అయితే సినిమా మొత్తం ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. క్లైమాక్స్ లో వచ్చే ‘తోడుగా మాతోడుండి’ […]

Written By:
  • Vicky
  • , Updated On : March 30, 2023 / 10:08 PM IST
    Follow us on

    Balagam : ఇటీవల కాలం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ సాధించిన చిత్రం ‘బలగం’.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు,ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కథ.డైరెక్టర్ వేణు ఎంచుకున్న స్టోరీ , ఆయన తీసిన విధానం సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.అయితే సినిమా మొత్తం ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు.

    క్లైమాక్స్ లో వచ్చే ‘తోడుగా మాతోడుండి’ అనే పాటని చూసి కంటతడి పెట్టని వాడు అంటూ ఉండదు.ఈ పాట పడుతూ తెరపైకి కనిపించిన దంపతులు మొగులయ్య – కొమురమ్మా తెలంగాణ లోని వరంగల్ జిల్లాలో దుగ్గొండి మండలం కి చెందిన వారు.స్వతహాగా ఈ దంపతులు ఆ ప్రాంతం లో బుర్ర కథలు చెప్పుకుంటూ అందులో వచ్చే డబ్బులతో పొట్టని నింపుకుంటూ ఉంటారు.ఆర్ధిక పరిస్థితి చాలా దారుణం.

    అయితే డైరెక్టర్ వేణు వీరిలో టాలెంట్ గుర్తించి ‘బలగం’ సినిమాలో అవకాశం ఇచ్చాడు.వేణు పుణ్యమా అని వీళ్లిద్దరికీ మంచి గుర్తింపు లభించింది.కానీ దురదృష్టం ఏమిటంటే మొగులయ్య కి తీవ్రమైన అస్వస్థత ఏర్పడింది.ప్రస్తుతం ఆయన గ్రామం లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.కరోనా సమయం లో మొగులయ్య రెండు కిడ్నీలు చెడిపోయాయి.దానికి తోడు ఆయనకీ షుగర్ మరియు బీపీ రావడం తో ఇప్పుడు రెండు కళ్ళు పని చెయ్యడం లేదు.ఇన్ని రోజులు ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకొని ‘బలగం’ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొంది ఇక నుండి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్న సమయం లో ఆయనకీ ఇలా జరగడం దురదృష్టకరం.

    రెండు కిడ్నీలు చెడిపోయిన దగ్గర నుండి ఆయన రోజు మార్చి రోజు డయాలిసిస్ చేయించుకుంటూనే ఉన్నాడు.ఇప్పుడు అదనంగా కళ్ళు కూడా పని చెయ్యకపోవడం తో తనని ఆదుకోవాలంటూ ప్రాధేయపడుతున్నాడు మొగులయ్య.మరి దిల్ రాజు వేణు స్పందించి ఇతనికి సహాయం చేస్తారో లేదో చూడాలి.