https://oktelugu.com/

Hero Nani : హీరో నానికి కలిసి వచ్చే పాత్రలు ఇవే.. దసరా అందుకే హిట్ అయ్యింది

Dasara – Hero Nani : నాని.. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. సహజ సిద్ధంగా నటిస్తాడు. అందుకే నేచురల్ స్టార్ అనే బిరుదు పొందాడు. ఈయన నటించిన సినిమాలు గ్యారంటీ అనే కీర్తిని సొంతం చేసుకున్నాయి. కానీ గ్యాంగ్ లీడర్, వీ, టక్ జగదీష్ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకో లేకపోయాయి. శ్యాం సింగరాయ్ సినిమా బాగున్నప్పటికీ.. ఓ వర్గం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 30, 2023 / 09:52 PM IST
    Follow us on

    Dasara – Hero Nani : నాని.. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. సహజ సిద్ధంగా నటిస్తాడు. అందుకే నేచురల్ స్టార్ అనే బిరుదు పొందాడు. ఈయన నటించిన సినిమాలు గ్యారంటీ అనే కీర్తిని సొంతం చేసుకున్నాయి. కానీ గ్యాంగ్ లీడర్, వీ, టక్ జగదీష్ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకో లేకపోయాయి. శ్యాం సింగరాయ్ సినిమా బాగున్నప్పటికీ.. ఓ వర్గం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో తనకు అచ్చి వచ్చిన విషాదపాత్రలోనే మళ్లీ నాని వెళ్లిపోయాడు. దసరా రూపంలో హిట్ కొట్టాడు.

    నిన్ను కోరి, ఎంసీఏ, జెర్సీ.. వంటి సినిమాలు నాని కెరియర్ కు చాలా హెల్ప్ అయ్యాయి..ఈ సినిమాల్లో నాని విషాద పాత్రల్లో నటించాడు.. దీంతో అవి ప్రేక్షకులను అలరించాయి. అయితే ఆ మధ్య వరుస పరాజయాలు పలకరించడంతో నాని మళ్లీ తన పాత రూట్లోకి వెళ్ళాడు. రొటీన్ సాంగ్స్, లవ్ స్టోరీ కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేశాడు. దసరా సినిమా ద్వారా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఏకంగా వాల్తేరు వీరయ్య సినిమాకు మించి ఓపెనింగ్ సాధించాడు. తన సత్తా ఇది అని నిరూపించాడు.

    నాని సినిమాల్లో నిన్ను కోరి, ఎంసీఏ, జెర్సీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమాల్లోని పాత్రల్లో నాని పండిస్తూనే ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాడు. తన పాత్రల మీద ప్రేక్షకులకు జాలి కలిగించేలా చేస్తాడు. తన సహజ సిద్ధ నటన కూడా తోడు కావడంతో ఈ సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఈ క్రమంలోనే దసరా సినిమా ద్వారా మళ్ళీ తనకు అచ్చి వచ్చిన సాడ్ నేటివిటీని నమ్ముకున్నాడు.

    సాధారణంగా ఎవరైనా ఏడిస్తే మనం జాలి పడతాం. మనుషులుగా అది మన నైజం. దసరా సినిమాలో ధరణి పాత్ర ద్వారా నాని విషాదాన్ని పండించాడు. తాను ప్రేమించిన అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడికి త్యాగం చేసే పాత్రలో ఒదిగిపోయాడు. అంతేకాదు తన స్నేహితుడు కళ్ళ ముందు చనిపోతే.. దానికి కారణమైన వ్యక్తిని చంపేందుకు వెనుకాడని పాత్రలో నాని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు.. ఏడుస్తూనే స్నేహానికి అసలైన అర్థం చెప్పాడు..

    పూర్తి రగ్డ్ లుక్ లో ఉన్న నాని.. ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురి చేశాడు.. అంతేకాదు పలు సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించాడు. ఇన్నాళ్ళు పక్కింటి అబ్బాయి లాంటి పాత్రలో ఒదిగిపోయిన నాని.. దసరా సినిమాలో ధరణి పాత్ర ద్వారా ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే నాని తనను తాను పునారవిష్కరించుకున్నాడు. కొత్త దర్శకుడిని నమ్మి, తన దర్శకత్వ ప్రతిభను నమ్మి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను ప్రచారం చేసుకున్నాడు. అతని కష్టం వృధాగా ఏం పోలేదు.. ఏకంగా తొలిరోజే భారీ వసూళ్ళు సాధించింది.

    సాధారణంగా మనం రగ్డ్ సినిమాలు అంటే ఏ తమిళమో, మలయాళమో అనుకుంటాం. కానీ దసరా సినిమా ద్వారా అపవాదును నాని పూర్తిగా తొలగించాడు. సినిమా కథకు అనుగుణంగా తన పాత్రలో సాడ్ షేడ్స్ లో ఉండేలా చూసుకున్న నాని.. వాటి ద్వారానే ప్రేక్షకులను రంజింపచేసేందుకు యత్నించాడు. ఇందులో సఫలీకృతుడు కూడా అయ్యాడు. నాని ఏడుస్తున్న తీరు చూస్తే అయ్యో పాపం ధరణి అనిపిస్తుంది. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో నానికి సాడ్ పాత్రలు కలిసి వస్తాయని ప్రేక్షకులు అంటున్నారు.. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో నానికి తన గత సినిమాలను గుర్తు చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది