Balagam: బలగం టాలీవుడ్ సెన్సేషనల్ చిత్రాల్లో ఒకటిగా అవతరించింది. దర్శకుడు వేణు ఎల్దండి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా చిత్రీకరించారు. తెలంగాణా పల్లె జీవనం, సంస్కృతి వెండితెర మీద హృద్యంగా ఆవిష్కరించారు. ఇంటి పెద్ద చావు చుట్టూ రెండు గంటల కథనం నడపడం చిన్న విషయం కాదు. కానీ ఏ మాత్రం విసుగు రాకుండా ఆద్యంతం ఆసక్తికరంగా వేణు సన్నివేశాలు రాసుకున్నారు. సహజంగా ఉన్న పాత్రల మధ్య ఎమోషన్ బలంగా పండించి. అది ప్రేక్షకుల మీద గట్టి ప్రభావం చూపించింది.
బలగం మూవీ విడుదలై నెల రోజులు దాటిపోయినా చర్చ నడుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో పలువురు బలగం అద్భుతం అంటూ కామెంట్స్, పోస్ట్స్ పెడుతున్నారు. కాగా పల్లెటూళ్లలో సామూహికంగా బలగం మూవీ చూస్తున్నారట. ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ముగిసిన ఈ సాంప్రదాయం బలగం మూవీతో తెరపైకి వచ్చింది. ఓ ఊరి జనం అందరూ ఒక చోట చేరి బలగం మూవీ చూశారు. బలగం ఓటీటీలో వచ్చిన నేపథ్యంలో రాత్రివేళ ఊరి కూడలిలో ప్రదర్శించారు.
పెద్దా చిన్నా ముసలి ముతక అంతా చేరి… బలగం మూవీ చూశారు. ఈ వీడియో వేణు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. చాలా సంతోషకర విషయం అంటూ ఉబ్బితబ్బిబయ్యాడు. డైరెక్టర్ వేణు ఎల్దండి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. గతంలో తెర మీద హిట్టు సినిమాలు ఇలానే పల్లెల్లో ప్రదర్శించేవారు. ఇన్నేళ్లకు బలగం మూవీ ఆ రోజులు గుర్తు చేసింది.
కాగా బలగం బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో చిత్ర యూనిట్ కి నిర్మాతలు దావత్ ఇచ్చారు. ఈ దావత్ కి సిరిసిల్ల వేదికైంది. బలగం మూవీలో కాకి ముట్టుడు సన్నివేశం తెరకెక్కించిన మర్రి చెట్టు వద్ద బలగం టీమ్ దావత్ చేసుకున్నారు. వేణు, ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ తో పాటు బలగం మూవీలో నటించిన నటులందరూ ఈ దావత్ కి హాజరయ్యారు. పొట్టేళ్లు కోసి, కల్లు తాగి ఎంజాయ్ చేశారు.
https://twitter.com/VenuYeldandi9/status/1641643381460983810