https://oktelugu.com/

Balagam Collections: ‘ఉగాది’ రోజున కూడా కొత్త సినిమాలను డామినేట్ చేసిన ‘బలగం’

Balagam Collections: ఒక చిన్న సినిమా టాలీవుడ్ లో అద్భుతాలు సృష్టించడం కొత్తేమి కాదు, గతం లో మనం ఎన్నో చూసాము కూడా. కానీ ఓటీటీ రాజ్యం ఏలుతున్న రోజుల్లో కూడా ఒక చిన్న సినిమా కోసం జనాలు బ్రహ్మరథం పట్టడం అనేది రీసెంట్ గా విడుదలైన బలగం ని చూసే తెలుసుకున్నారు ట్రేడ్ పండితులు. అసలు ఎలాంటి బడ్జెట్ లేకుండా, భారీ తారాగణం తో అవసరం లేకుండా ఒక జబర్దస్త్ కమెడియన్ సృష్టించిన ప్రభంజనం ఇది. […]

Written By:
  • Vicky
  • , Updated On : March 23, 2023 / 07:11 AM IST
    Follow us on

    Balagam Collections

    Balagam Collections: ఒక చిన్న సినిమా టాలీవుడ్ లో అద్భుతాలు సృష్టించడం కొత్తేమి కాదు, గతం లో మనం ఎన్నో చూసాము కూడా. కానీ ఓటీటీ రాజ్యం ఏలుతున్న రోజుల్లో కూడా ఒక చిన్న సినిమా కోసం జనాలు బ్రహ్మరథం పట్టడం అనేది రీసెంట్ గా విడుదలైన బలగం ని చూసే తెలుసుకున్నారు ట్రేడ్ పండితులు. అసలు ఎలాంటి బడ్జెట్ లేకుండా, భారీ తారాగణం తో అవసరం లేకుండా ఒక జబర్దస్త్ కమెడియన్ సృష్టించిన ప్రభంజనం ఇది.

    మొదటి రోజు కేవలం 50 లక్షల గ్రాస్ ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా నేడు 20 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటి సంచలనం సృష్టించడం అంటే, మంచి సినిమా ఇస్తే జనాలు ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొత్త సినిమాలు ప్రతీ వారం వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ బలగం సినిమా బాక్స్ ఆఫీస్ డామినేషన్ ని మాత్రం ఆపలేకపోతున్నాయి.

    నిన్న ఉగాది రోజున రెండు కొత్త సినిమాలు విడుదలయ్యాయి, కానీ ఆ రెండు సినిమాలకంటే బలగం కి ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ పండితులను సైతం షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా నైజాం ప్రాంతం గురించి చెప్పుకోవాలి. నిన్న హైదరాబాద్ వంటి సిటీ లో ఈ సినిమాకి వచినటువంటి కలెక్షన్స్ నిన్న విడుదలైన కొత్త సినిమాలు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఉగాది పర్వదినం ని పురస్కరించుకొని ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేసారు.

    Balagam Collections

    ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం నిన్న ఒక్క రోజే దాదాపుగా నైజం ప్రాంతం నుండి రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని అంచనా వేస్తున్నారు,ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి నిన్న ఒక్క రోజే మూడు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది అట. ఇది నిజంగా అరాచకం అనే చెప్పాలి, సినిమా విడుదలై 20 రోజులు అవుతున్నా కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం ఈమధ్య కాలం లో స్టార్ హీరోలకు సాధ్యపడలేదు.ఈ వసూళ్ల జాతర ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది ట్రేడ్ పండితులు సైతం చెప్పలేకున్నారు.