https://oktelugu.com/

Aamir Khan- Dasara Movie: ‘దసరా’ రీమేక్ లో సూపర్ స్టార్.. వర్కౌట్ అవుతుందా..?

Aamir Khan- Dasara Movie: ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘దసరా’. న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ దగ్గర నుండే విజృంభించేసింది. అంతే కాదు హీరో నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలలో ఒకడిగా నిల్చిన నాని, ఈ సినిమాతో స్టార్ హీరోల లీగ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 10, 2023 / 05:55 PM IST
    Follow us on

    Aamir Khan- Dasara Movie

    Aamir Khan- Dasara Movie: ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘దసరా’. న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ దగ్గర నుండే విజృంభించేసింది. అంతే కాదు హీరో నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలలో ఒకడిగా నిల్చిన నాని, ఈ సినిమాతో స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టాడు.

    సుమారుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి షేర్స్ ని రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. కేవలం తెలుగు లో మాత్రమే కాదు,ఈ సినిమా హిందీ, తమిళం,మలయాళం మరియు కన్నడ బాషలలో కూడా విడుదలైంది. కానీ ఆ బాషల నుండి అసలు కలెక్షన్స్ రాలేదు.

    మూవీ టీం మరియు హీరో నాని ప్రొమోషన్స్ కోసం బాగా కష్టపడ్డారు కానీ, ఎందుకో ఇతర బాషలలో వర్కౌట్ అవ్వడం లేదు.అయితే ఈ సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ రీసెంట్ గానే చూసి ఎంతో మెచ్చుకున్నాడట. ఈ చిత్రాన్ని ఆయన రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

    Aamir Khan- Dasara Movie

    ఆయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఈసారి స్క్రిప్ట్ ఎంపిక విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలని,సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్న సమయం లో ‘దసరా’ సినిమా వచ్చి ఆయనని ఎంతగానో ఆకట్టుకుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి దంగల్ తర్వాత సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న అమిర్ ఖాన్ కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.