Rashmika Mandanna: లక్కీ లేడీ ఇమేజ్ తో దూసుకుపోతుంది రష్మిక మందాన. 2016లో కెరీర్ మొదలు పెట్టిన రష్మిక అనతి కాలంలో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. స్టార్ హీరోల ఛాయిస్ అయ్యారు. గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి భారీ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. నేషనల్ క్రష్ గా అవతరించిన రష్మిక బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అయితే ఆమె కెరీర్ లో తిరోగమనం మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది పరాజయాలు, పరాభవాలతో ముగిసింది. రష్మిక నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు, గుడ్ బై ఫ్లాప్ అయ్యాయి. సీతారామం విజయం సాధించినా… క్రెడిట్ మృణాల్ ఠాకూర్ కథలోకి వెళ్ళింది.

లేటెస్ట్ రిలీజ్ వారసుడు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ మేనియాతో ఆడింది. దానికి తోడు రష్మిక ప్రాధాన్యం లేని పాత్ర చేశారు. హిందీ చిత్రం మిషన్ మజ్ను ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో నేరుగా విడుదలైన మిషన్ మజ్ను రష్మిక బాలీవుడ్ ఆశలను దెబ్బతీసింది. మరోవైపు వరుస వివాదాలతో రష్మిక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆమె కామెంట్స్ కన్నడ పరిశ్రమకు దూరమయ్యేలా చేశాయి. ఒక దశలో శాండిల్ వుడ్ ఆమెను బ్యాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాంతార దర్శక హీరో రిషబ్ శెట్టితో కోల్డ్ వార్ నడుస్తోంది.
రష్మిక ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు విజయ్ దేవరకొండనే కారణమట. ఆయనతో స్నేహం రష్మిక జాతకం మీద ప్రతికూల ప్రభావం చూపుతుందట. రష్మిక విజయ్ కి దగ్గరైతే మరిన్ని కష్టాలు తప్పవట. ఈ విషయాన్ని వేణు స్వామి వెల్లడించారు. రష్మిక-విజయ్ దేవరకొండల జాతకారీత్యా కలిసి ఉండటం మంచిది కాదట. అద్భుత జాతకం కలిగిన రష్మిక కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

విజయ్ దేవరకొండకు దూరంగా ఉంటే రష్మిక జీవితం బాగుంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. వేణు స్వామి మాటలు కొట్టిపారేయలేం. ఎందుకంటే ఆయన్ని ఆమె చాలా విశ్వసిస్తారు. రష్మిక వేణుతో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆయన పూజల కారణంగానే తాను టాప్ హీరోయిన్ అయ్యానని నమ్ముతుంది. ప్రేమించిన రక్షిత్ శెట్టితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా వేణు స్వామినే కారణమట. మీ జాతకాలు కలవలేదు. ఆయన్ని వివాహం చేసుకోవద్దని చెప్పడంతో రష్మిక పెళ్లి ఆలోచన మానుకున్నారని వేణు స్వామి స్వయంగా చెప్పడం విశేషం. ఆ లెక్కన విజయ్ దేవరకొండకు రష్మిక త్వరలో గుడ్ బై చెబుతుందేమో చూడాలి.