Baba Re Release Collections: ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ అన్ని బాషలలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే..పోకిరి రీ రిలీజ్ నుండి ఈ ట్రెండ్ ఊపందుకుంది..మహేష్ బాబు పుట్టినరోజు సందర్భం గా పోకిరి సినిమాని 4K కి రీ మాస్టర్ చేసి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో స్పెషల్ షోస్ వేసుకున్నారు ఫ్యాన్స్..దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ స్పెషల్ షోస్ నుండి కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఆ తర్వాత వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు జల్సా మూవీ స్పెషల్ షోస్ వేసుకున్నారు.ఈ స్పెషల్ షోస్ ఒక చరిత్ర..సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 750 షోస్ వెయ్యగా, మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఆల్ టైం ఆల్ ఇండియన్ రికార్డు..ఈ రికార్డుని ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టేస్తారని అనుకున్నారు..కానీ దగ్గర్లోకి కూడా రాలేకపోయారు..ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ రికార్డు ని ముట్టుకోలేకపొయ్యాడు.
ఈరోజు సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా గత రెండు రోజుల నుండి బాబా మూవీ స్పెషల్ షోస్ ని నిర్వహిస్తున్నారు ఫ్యాన్స్..వారం రోజులపాటు ఈ షోస్ ప్రదర్శితం కాబోతుంది..ఒక్క చెన్నై సిటీ లోనే వందకి పైగా షోస్ ని ప్రదర్శించబడుతున్న ఈ చిత్రానికి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..అలాగే కర్ణాటక ప్రాంతం లో ఈ చిత్రానికి 8 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగ, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

మొత్తం మీద ఇండియా లో అన్ని ప్రాంతాలకు కలిపి 93 లక్షల రూపాయిలు వచ్చాయి..మరో నాలుగు రోజులు పాటు ప్రదర్శించినా కూడా పవన్ కళ్యాణ్ జల్సా కలెక్షన్స్ రికార్డు ని కొట్టడం అసాధ్యమని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నమాట..ఈ రికార్డు ని బద్దలు కొట్టే హీరోనే లేడా..మళ్ళీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ రికార్డు ని బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి.