Vishal: తెలుగు మరియు తమిళం బాషలలో మంచి మార్కెట్ ని ఏర్పర్చుకున్న హీరోలలో ఒకడు విశాల్..ఒకప్పుడు ఇతని సినిమా విడుదల అవుతుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ దద్దరిల్లేవి..పందెం కోడి , పొగరు, భరణి , పిస్తా , డిటెక్టీవ్ మరియు అభిమన్యుడు ఇలా తెలుగు లో దబ్ అయినా విశాల్ సినిమాలు ఎన్నో సూపర్ హిట్స్ గా నిలిచాయి..అయితే ప్రస్తుతం ఆయనకీ సరైన హిట్స్ లేవు..అభిమన్యుడు సినిమా తర్వాత ఆయన చేసిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచాయి.

ఇక ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం లాఠీ విడుదల కి సిద్ధం గా ఉంది..అయితే విశాల్ రీసెంట్ గా తనకి వచ్చిన క్రేజీ ఆఫర్ ని వదులుకున్నాడు..తమిళ స్టార్ హీరో విజయ్ మరియు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ‘మాస్టర్’ తర్వాత మరో సినిమా తెరకెక్కబోతుంది..విక్రమ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో అంచనాలు మామూలుగా లేవు.
అయితే ఈ సినిమాలో విలన్ రోల్ కోసం హీరో విశాల్ ని సంప్రదించాడట లోకేష్ కనకరాజ్..లోకేష్ తన సినిమాల్లో విలన్స్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో తెలిసిందే..మాస్టర్ మరియు విక్రమ్ సినిమాలలో విజయ్ సేతుపతి ని ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో మనం చూసాము..ఒకవిధంగా చెప్పాలంటే హీరో ని కూడా డామినేట్ చేసాయి ఆ పాత్రలు..ఇక విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో స్టార్ హీరో సూర్య ని రోలెక్స్ అనే నెగటివ్ పాత్రలో చూపించి సెన్సేషన్ సృష్టించాడు లోకేష్.

అలాంటి డైరెక్టర్ సినిమాలో విలన్ రోల్ మిస్ అవ్వడం అంటే గోల్డెన్ ఛాన్స్ వదులుకునట్టే..అయితే దీనిపై విశాల్ క్లారిటీ ఇచ్చాడు ‘వరుసగా సినిమాలకు కమిట్మెంట్స్ ఇవ్వడం వల్లే నేను ఈ సినిమా వదులుకున్నాను..కానీ భవిష్యత్తులో ఇలాంటి ఆఫర్స్ ఎన్నో వస్తాయి..నాకు విజయ్ గారిని డైరెక్ట్ చెయ్యాలని ఉంది..నా దగ్గర ఆయన కోసం ఒక అద్భుతమైన స్టోరీ సిద్ధం గా ఉంది..ఆయన ఒప్పుకుంటే ఆయనతో ఆ సినిమాని చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు విశాల్.