RRR Golden Globe Award- Bandi Sanjay: తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని నెటిజెన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తరుణంలో బండి సంజయ్ ఇరుకునపడ్డారు. ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ గెలుచుకోవడానికి… బండి సంజయ్ ట్రోల్ కావాడానికి సంబంధం ఏమిటనే డౌట్ మీకు రావచ్చు. అయితే దానికి ఓ లింక్ ఉంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. ఈ అద్భుత ఘట్టాన్ని ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది.

రెండు సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ఏ ఆర్ రెహమాన్ ఆర్ ఆర్ ఆర్ టీం పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఒరిజినల్ స్కోర్ విభాగంలో అందుకోగా… కీరవాణికి ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది. ఆసియాలోనే ఫస్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు రికార్డులకు ఎక్కింది. చిత్ర ప్రముఖులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రధాని ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని నెటిజెన్స్, ఆర్ ఆర్ ఆర్ మూవీ లవర్స్ తప్పుబట్టారు. కారణం… గతంలో బండి సంజయ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ వీడియోలో భీమ్ రోల్ చేసిన ఎన్టీఆర్ ని ముస్లింగా చూపించారు. దీనిపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ సీరియస్ కామెంట్స్ చేశారు.

గోండు జాతి వీరుడు కొమురం భీమ్ ని ఒక ముస్లిం గా ఎలా చూపిస్తారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే. రాజమౌళి భీమ్ ని ముస్లింగా చూపించే ఆలోచన మార్చుకోవాలి. మూవీ నుండి ఆ సన్నివేశాలు తొలగించాలి. లేదంటే… ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రదర్శన అడ్డుకుంటాము. థియేటర్స్ తగలబెడతామని హెచ్చరికలు జారీ చేశారు. దర్శకుడు రాజమౌళిపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవన్నీ మనసులో పెట్టుకున్న జనాలు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని అభినందిస్తూ బండి సంజయ్ ట్వీట్ చేయగానే, అప్పుడు అంతగా చిత్రాన్ని ద్వేషించిన మీరు ఇప్పుడు పొగుడుతూ ఎలా ట్వీట్ వేస్తారంటూ కౌంటర్లు వేస్తున్నారు. మీరు మర్చిపోయారేమో మేము కాదంటూ ఎద్దేవా చేస్తున్నారు.
— Marco (@fleabag_marco) January 11, 2023