
Jabardasth Ram Prasad : జబర్దస్త్ కమెడియన్స్ లో ఆటో రామ్ ప్రసాద్ ఒకరు. సుడిగాలి సుధీర్ టీమ్ కామెడీ త్రయంగా సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ పేరుగాంచారు. ఆ టీం సక్సెస్ కావడంలో రామ్ ప్రసాద్ పాత్ర ఎంతగానో ఉంది. స్కిట్స్ రాసేది రామ్ ప్రసాదే. ఆటో పంచ్ లు అనే తనదైన కామెడీ స్టైల్ సృష్టించాడు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి జబర్దస్త్ వేదికగా రామ్ ప్రసాద్ సంచలనాలు చేశాడు. ఇక ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ . ఒకరికొకరు చాలా సప్పోర్ట్ గా ఉంటారు. ముగ్గురూ కలిసి త్రీ మంకీస్ టైటిల్ తో మూవీ కూడా చేశారు.
కాగా ఆటో రామ్ ప్రసాద్ కి క్యాన్సర్ అంటూ కొన్నాళ్లుగా ప్రచారం అవుతుంది. ఆ మధ్య రామ్ ప్రసాద్ ఆసుపత్రిలో తలకు మెడికల్ క్యాప్ పెట్టుకొని కనిపించారు. ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అప్పుడే రామ్ ప్రసాద్ కి క్యాన్సర్ అన్న పుకార్లకు బీజం పడింది. గాలోడు ప్రీ రిలీజ్ వేడుకకు సుధీర్ మిత్రులు అందరూ హాజరయ్యారు. రామ్ ప్రసాద్ మాత్రం రాలేదు. ఫోన్లోనే బెస్ట్ విషెస్ చెప్పాడు. రామ్ ప్రసాద్ కి ఆరోగ్యం బాగోక రాలేకపోయాడని సుధీర్ చెప్పారు. ఇవన్నీ సమీకరించి రామ్ ప్రసాద్ కి క్యాన్సర్ అన్నమాట నిజమే కావచ్చని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
కాగా ఈ వార్తలపై రామ్ ప్రసాద్ స్వయంగా స్పందించారు. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ మణికొండలో స్టార్ట్ చేశాడు. ఓపెనింగ్ కి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మీకు క్యాన్సర్ అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటని ప్రతినిధులు అడిగారు. అది కేవలం అపోహ మాత్రమే. నాకు ఎలాంటి కాన్సర్ లేదని స్పష్టత ఇచ్చారు.
నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను. అప్పుడు తీసిన ఫోటో వైరల్ అయ్యింది. ఆ కారణంతోనే నేను క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్నాను… అని రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. రామ్ ప్రసాద్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ విచ్ఛిన్నమైంది. జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ తప్పుకున్న నేపథ్యంలో అప్పటి మజా లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. జబర్దస్త్ కి మునుపటి కళ లేదు.