
Dil Raju : గత రెండు దశాబ్దాల నుండి టాలీవుడ్ లో టాప్ నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న నిర్మాత దిల్ రాజు, చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరితో ఆయన పని చేసాడు..ఆయన ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక సినిమా విడుదల అవుతుంది అంటే అది సూపర్ హిట్ అని ముందే ఫిక్స్ అయిపోవచ్చు.
మార్కెట్ లో ఆయనకీ ఉన్న బ్రాండ్ వేల్యూ అలాంటిది మరి..ఇన్ని రోజులు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన దిల్ రాజు బ్రాండ్ నేడు కోలీవుడ్ మరియు బాలీవుడ్ కి కూడా వ్యాపించింది..రీసెంట్ గానే ఆయన తమిళ హీరో విజయ్ తో ‘వారిసు’ అనే సినిమా తీసి సూపర్ హిట్ ని అందుకున్నాడు..ఈ చిత్రాన్ని తెలుగు లో ‘వారసుడు’ పేరుతో విడుదల చెయ్యగా ఇక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది.
కేవలం నిర్మాణ రంగం లో మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు కి ఒక బ్రాండ్ వేల్యూ ఉంది.ఇండస్ట్రీ లో ఒక మంచి కాంబినేషన్ తో సినిమా తెరకెక్కి టీజర్ మరియు ట్రైలర్ బాగుంది అంటే ఆ చిత్రం రైట్స్ ని కొన్ని ప్రాంతాలకు కొని విడుదల చేస్తాడు దిల్ రాజు.అలా తెలుగు సినిమాలతో పాటుగా బోలెడన్ని డబ్బింగ్ సినిమాలను కూడా కొన్నాడు..వాటిల్లో లవ్ టుడే అనే సినిమా ఒకటి.ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన ‘ఇవానా’ కి మన తెలుగు ఆడియన్స్ లో మాములు క్రేజ్ రాలేదు..పబ్లిక్ పల్స్ ని పట్టడం లో మంచి నేర్పరి అయినా దిల్ రాజు ఈ అమ్మాయి కోసం కోట్ల రూపాయిలు కుమ్మరించి తన తదుపరి చిత్రాలలో బుక్ చేసుకున్నాడు.
కేవలం అడ్వాన్స్ రూపం లోనే ఆమెకి పది కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చాడట.దిల్ రాజు ఎప్పుడు డేట్స్ అడిగితే అప్పుడు ఇచ్చేయాలి.అలా నాలుగైదు సినిమాలకు సరిపడా అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నాడట దిల్ రాజు.అయితే ఒక సినిమా ఫ్లాప్ అయితే సదరు హీరోయిన్ ని మళ్ళీ తమ సినిమాలోకి తీసుకోవడానికి ఆలోచించే నిర్మాతలు ఉన్న ఈ కాలం లో , ఇవానా కి ఈ రేంజ్ అడ్వాన్స్ ఇచ్చి దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడా అని విశ్లేషకులు అనుమానం పడుతున్నారు.