
Female Teachers : శారీరక వాంఛ తీర్చుకునేందుకు ఈ మధ్యకాలంలో విపరీతమైన పోకడలకు పోతున్నారు. చేస్తున్న వృత్తి.. వయసు కూడా మర్చిపోతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని ఉన్నతి వైపు తీసుకెళ్లాల్సిన టీచర్లే వక్రమార్గాన్ని పట్టిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పాఠాలు చెప్పి పిల్లల ఎదుగుదలకు కారణమవ్వాల్సిన టీచర్లు.. ఆ పిల్లలతో లైంగిక చర్యకు పాల్పడడం గమనార్హం.
పాఠశాల విద్యార్థులతో లైంగిక చర్యలకు పాల్పడుతున్న మహిళా టీచర్లను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజులు వ్యవధిలో మొత్తం ఆరు కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అమెరికాలోని వాషింగ్టన్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తు గొల్పుతున్నాయి. కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ తరహా కేసులు ఆరు నమోదు కాగా.. బయటికి రానివి ఇంకా ఎన్ని ఉంటాయో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
పదహారేళ్ల యువకులతో లైంగిక చర్య..
ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. కాలిఫోర్నియాలోని డానివిళ్లే పట్టణానికి చెందిన ఎలెన్ షెల్ (38) స్థానికి పాఠశాలలో పని చేస్తున్నారు. ఇటీవల ఆమె ఇద్దరు పదహారేళ్ల యువకులతో పలుమార్లు లైంగిక చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి గరార్డ్ కౌంటి కోర్టు ముందు హాజరు పరిచారు. ఆమెపై థర్డ్ డిగ్రీ అత్యాచారం అభియోగాలు నమోదయ్యాయి. ఆర్కన్సాస్ రాష్ట్రానికి చెందిన హెథర్ హరే (32) అనే మహిళా టీచర్ పైనా లైంగిక దాడికి సంబంధించిన కేసు నమోదు అయింది. టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అదే విధంగా ఒక్ల హామాకు చెందిన ఏమీలి హాన్కాక్(26) కూడా విద్యార్థులతో సంబంధం నేరుపుతోందని ఆరోపణలు రావడంతో స్థానిక పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. లిన్ కాల్న్ కౌంటిలోని ఓ పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న మరో టీచర్ ఎమ్మా డిలానే.. అదే పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థితో సంబంధం పెట్టుకున్నట్లు.. అతడితో స్నాప్ చాట్ లోను సంభాషించేదని తేలింది. అయోవా రాష్ట్రంలోని దేస్ మొయిన్స్ లో ఉన్న హైస్కూల్లో కృస్టెన్ గ్యాంట్ అనే ఇంగ్లీష్ టీచర్ అదే పాఠశాలకు చెందిన టీనేజీ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ కలిసిన దృశ్యాలు సీసీటీవీలోనూ రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు.
నెలల తరబడి అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో కేసు నమోదు..
అలాగే అమెరికాలోని వర్జీనియాలోని ఓ హై స్కూల్లో 33 ఏళ్ల వయసున్న మహిళా టీచర్ ఒక విద్యార్థితో చాలా నెలలుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తోందన్న ఆరోపణలపై కేసు నమోదు అయింది. ఈమె సదరు విద్యార్థిపై లైంగికంగా అనేకసార్లు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు. అలాగే పెన్సిల్వినియాకు చెందిన జావేలిన్ కోచ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె కూడా 15 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులతో లైంగికంగా అనేకసార్లు కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో విద్యార్థులతో మహిళా టీచర్లు లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించి రెండు రోజుల్లోనే ఆరు కేసులు నమోదు కావడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. సాధారణంగా ఆడపిల్లలపై ఈ తరహా వేధింపులు, ఘటనలు చూస్తుంటాము. అందుకు భిన్నంగా పురుషులపై లైంగిక వేధింపులు జరుగుతుండడం ఇప్పుడు అమెరికాలోని పిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది ఈ అంశం. తాజా కేసులో నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.