Atrocities in Tamil Nadu: తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మాప్పిళ్లైయురాణి కామరాజ్ ఏరియాలో నివాసం ఉంటున్న డేవిడ్ అనే వ్యక్తికి చాలాకాలం క్రితమే వివాహం జరిగింది. కొంతకాలం కాపురం చేసిన తర్వాత భార్యతో గొడవలు రావడంతో విడాకులు తీసుకుని వేరుగా నివసిస్తున్నాడు. అయితే అదే ఏరియాలో స్టెఫినా అనే మహిళ కూడా నివాసం ఉంటోంది. ఆమెకు కూడా వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

స్టెఫినా ప్రవర్తన తేడాగా ఉండటంతో ఆమె భర్తకు అనుమానం వచ్చింది. ఇతర మగాళ్లతో తిరుగుతోందని తెలుసుకుని అతడు తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. కట్ చేస్తే డేవిడ్‌కు, స్టెఫినాకు లంకె కుదిరింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. చివరకు వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. అనంతరం వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే స్టెఫినాకు ఆమె మొదటి భర్త కారణంగా పుట్టిన ఇద్దరు పిల్లలు ఆమెతోనే ఉంటున్నారు.
Also Read: Ram Gopal Varma Maa Ishtam Movie: హేయ్.. వివాదాస్పద వర్మ షాక్ ఇచ్చాడుగా !
తన జీవితంలోకి రెండో భర్త వచ్చినా స్టెఫినా ప్రవర్తనలో మార్పు రాలేదు. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న ఆమె పరాయి మగాళ్లతో చనువుగా ఉంటుందని తెలుసుకున్న డేవిడ్ కోపంతో రగిలిపోయాడు. పలుమార్లు హెచ్చరించాడు. స్కూల్‌కు వెళ్లొచ్చే ముసుగులో ఇతర మగాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్న స్టెఫినా ప్రవర్తన కారణంగా తన పరువు పోతుందని డేవిడ్ తనలో తాను కుమిలిపోయాడు.

అయితే డేవిడ్ ఎంతచెప్పినా స్టెఫినా తీరు మారలేదు. దీంతో స్టెఫినా రెండేళ్ల కూతురు కేథరీన్‌ను డేవిడ్ గోడకేసి కొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తన రెండో భార్య స్టెఫినాకు కొందరితో అక్రమ సంబంధం ఉందని, అందుకే ఆమె బిడ్డను చంపేశానని డేవిడ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో డేవిడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Also Read:Ashokavanamlo Arjuna Kalyanam: ట్రైలర్ టాక్: అర్జున కళ్యాణంలో మలుపుల మయం !
Recommended Videos