Atrocities In Pune: మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అన్నారో సినీకవి. మనిషిలో మంచి లక్షణాలు కనుమరుగవుతున్నాయి. జంతు లక్షణాలు బయటకు వస్తున్నాయి. అందుకే హత్యలు, అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. మనిషిలో కూడా రాక్షసుడు ఉన్నాడు. ఇది నిజమని నిరూపించే సంఘటనలు సైతం కనిపిస్తున్నాయి. మనుషులపైనే కాకుండా పశువులపైనా అత్యాచారాలకు తెగబడటం దేనికి సంకేతం. నాగరికత ప్రభావమా? లేక రాక్షస తత్వం పెరగడమా? పాశ్చాత్య సంస్కృతి ముసుగులో మనం మన ఆచార వ్యవహారాలను తుంగలో తొక్కుతున్నాం. ఆవును పవిత్రమైన దేవతగా పూజించే మన ఆచారాల్లో ఆవుపైనే లైంగిక దాడికి తెగబడటం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. మనిషిలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. పశుత్వం మాత్రం పడగ విప్పుతోంది. దీంతో అరాచకాలే పెరుగుతున్నాయి.

మహారాష్ట్రలోని పుణే లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. లోనేవాలా లోని కుస్ గావ్ లో సతీష్ అనే వ్యక్తికి పవువులు ఉన్నాయి. అందులో కొన్ని ఆవులు కూడా ఉన్నాయి. అర్థరాత్రి రెండు గంటల తరువాత ఆవు పెద్దగా అరవడంతో సతీష్ ఏమైందని బయటకు వచ్చి చూశాడు. దీంతో ఆశ్చర్యపోయాడు. ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడు. దీంతో అది బాధతో అరిచింది. సతీష్ వెంటనే కేకలు వేయగా కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చారు. నిందితుడు పారిపో్యాడు.
Also Read: Hyderabad Gang Rape: గ్యాంగ్ రేప్ పొలిటికల్ టర్న్.. కేసీఆర్‌ను టార్గెట్ చేసిన బీజేపీ!
దీనిపై సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అత్యాచారం జరిగిన ఆవును పరీక్షించాల్సిందిగా పోలీసులు వెటర్నరీ వైద్యులను కోరగా వారు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. దీంతో నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మూగ జీవాలపై రాక్షసత్వం ప్రదర్శించడం దారుణమని అందరు ముక్తకంఠంతో చెబుతున్నారు. నిందితుడికి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే విధంగా గతంలో నిర్మల్ జిల్లాలోనూ ఓ సంఘటన చోటుచేసుకుంది. బెంగుళూరులోనే జరిగింది. పశువులపై విచక్షణారహితంగా లైంగిక దాడులకు తెగబడటంతో అసలు మనుషులా? పశువులా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. పవిత్రమైన గోవును గోమాతగా పూజించే మన దేశంలో ఇలాంటి దురాగాతాలు చోటుచేసుకోవడంపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠినమైన శిక్షలు పడేలా చూడాలని కోరుతున్నారు.
Also Read:Chandrababu: టీడీపీ కొంపముంచుతున్న కోటరీ.. కట్టడి చేయలేకపోతున్న చంద్రబాబు