Homeఎంటర్టైన్మెంట్Pavan Kalyan And Prabhas: విచిత్రమైన సమస్య తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్

Pavan Kalyan And Prabhas: విచిత్రమైన సమస్య తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్

Pavan Kalyan And Prabhas: మన టాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు అని అడిగితె మనకి టక్కుమని గుర్తుకు వచ్చే పేర్లు పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్..వీళ్లిద్దరి సినిమాలు వస్తున్నాయి అంటే చాలు..అభిమానులు థియేటర్స్ వైపు బారులు తీస్తారు..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న వీళ్లిద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయి..ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే తత్వం ఈ హీరోల దగ్గర నుండి చూసి నేర్చుకోవాలి..సాధారణంగా మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఒక్క పెద్ద హిట్ వస్తే పొంగిపోవడం..ఫ్లాప్ వస్తే కృంగిపోవడం చేస్తూ ఉంటారు..కానీ ఎంత పెద్ద హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చిన నేను పెద్ద తోపు అనే ఫీలింగ్ ఈ ఇద్దరి హీరోలకు ఉండదు..అందుకే వీళ్ళిద్దరిని అభిమానులు అంతలా ఆరాధిస్తూ ఉంటారు..అయితే వీళ్లిద్దరి లో ఉన్న మంచి కామన్ పాయింట్స్ ని పక్కన పెడితే..సినిమాలు సెట్ చేసుకోవడం కూడా ఒక్కేలా ఉంటాయి..ప్రభాస్ ఎక్కువగా కొత్త డైరెక్టర్స్ ని ఎంచుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు..కొన్ని సందర్బాలలో ఆ సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా అయ్యాయి..అలాగే పవన్ కళ్యాణ్ కూడా అంతే..తనకి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ తగ్గ కాంబినేషన్స్ ఇప్పటి వరుకు సెట్ చేసుకోలేదు.. ఇన్ని విషయాల్లో కామన్ గా కనిపిస్తున్న ఈ ఇద్దరి హీరోలకు ఇప్పుడు ఒక్క పెద్ద సమస్య వచ్చి పడింది.

Pavan Kalyan And Prabhas
Pavan Kalyan And Prabhas

సాధారణంగా ఏ స్టార్ హీరోకి అయిన హీరోయిన్ కి అయిన ఫిట్ గా ఉండడం అత్యవసరం..ఫిట్ గా లేకపోతే క్రేజ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ ని వెంటాడుతున్న సమస్య ఇదే..పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం లో ఎంత ఫిట్ గా ఉండేవాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పాలిటిక్స్ లోకి వెళ్ళకముందు ఆయన చాలా ఫిట్ గా మరియు గ్లామర్ గా ఉండేవాడు..కానీ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ రెండిటిని బాలన్స్ చెయ్యడం కష్టం అయ్యేసరికి ఫిట్నెస్ పోయింది..దాని వల్ల ముఖం లో గ్లామర్ కూడా తగ్గింది..కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆయన చేస్తున్న హరిహరవీరమల్లు సినిమా కోసం ఫిట్ గా ఉండేందుకు చాలా కష్టపడుతున్నాడు..ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియో లో కూడా ఆయన చేసిన స్తంట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు..కానీ ఎంత ఫిట్నెస్ కోసం ట్రై చేసిన ఒక్కప్పటి పవన్ కళ్యాణ్ లుక్స్ ని మళ్ళీ తీసుకొని రావడం కష్టమే..ఒక్కప్పుడు గంటల తరబడి జిమ్ లో ఫిట్నెస్ కోసం కష్టపడే పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఆ రేంజ్ స్కోప్ దొరకడం లేదు..పైగా కరోనా ఆయనకీ అప్పట్లో చాలా తీవ్రమైన ఎఫెక్ట్ ని ఇచ్చింది..డాక్టర్ల సలహా మేరకు ఎక్కువగా వర్కౌట్స్ చెయ్యకూడదు.

Pavan Kalyan And Prabhas
Pavan Kalyan

Also Read: Hyderabad Minor Girl Incident  28న రేప్.. 31న ఎఫ్ఐఆర్.. 3న అరెస్ట్.. ఏం జరుగుతోంది?

సేమ్ పవన్ కళ్యాణ్ పరిస్థితి లాగానే మారింది ప్రభాస్ పరిస్థితి కూడా..బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ లుక్స్ బాగా దెబ్బ తిన్నాయి..ముఖ్యంగా సాహూ మరియు రాధే శ్యామ్ సినిమాలలో ప్రభాస్ లుక్స్ అభిమానులను సైతం బాగా నిరాశ పరిచింది..సరైన డైట్ తీసుకోకపోవడం..వర్కౌట్స్ సరిగా చెయ్యకపోవడం వల్లే ప్రభాస్ లుక్స్ దెబ్బ తిన్నాయి అని అభిమానులు చెప్పే మాట..అది కూడా కాకుండా ప్రభాస్ ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఒక్కేసారి మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు..ఆయన నటిస్తున్న సలార్, ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ K చిత్రాల షూటింగ్స్ ఒక్కే సమయం లో జరుగుతున్నాయి..దీనితో ఆయన సమయం మొత్తం ఈ సినిమాలకే కేటాయించడానికి సరిపోతుండడం తో వర్కౌట్స్ కి సరైన సమయం కేటాయించలేకపోతున్నాడు..అందుకే ప్రభాస్ లుక్స్ బాగా దెబ్బ తిన్నాయి అని ఇండస్ట్రీ లో వినిపించే మాట..ప్రభాస్ మళ్ళీ పూర్తి స్థాయి ద్రుష్టి పెడితే ఆయన ఫిజిక్ మళ్ళీ తిరిగి రావడం పెద్ద కష్టం ఏమి కాదు అని అభిమానులు అనుకుంటున్నారు..చూడాలి మరి రాబొయ్యే సినిమాల్లో ప్రభాస్ ఎంత ఫిట్ గా కనిపించబోతున్నాడు అనేది.

Pavan Kalyan And Prabhas
Prabhas

Also Read: Raghunandan Rao: బాలికపై గ్యాంగ్ రేప్ కేసు: సంచలన వీడియో బయటపెట్టిన రఘునందన్ రావు

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular