https://oktelugu.com/

Ata Sandeep: ‘చిరంజీవి చాపల కూర’ వివాదంపై ఆట సందీప్ సంచలన వ్యాఖ్యలు

Ata Sandeep: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ మాములుది కాదు. స్వయంగా కష్టపడి మెగాస్టార్ వరకు పేరు తెచ్చుకున్నారు. అన్ని రకాల సినిమాలు చేస్తూ సినీ ప్రేక్షకులను అలరించారు. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతూ ఆకట్టుకున్నారు. ఆ తరువాత బ్లడ్ బ్యాంక్ లాంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే కొందరు మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి ఏం చేయలేదని, ఇంత పెద్ద స్టార్ అయినా సినిమాను పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2021 / 12:59 PM IST
    Follow us on

    Ata Sandeep: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ మాములుది కాదు. స్వయంగా కష్టపడి మెగాస్టార్ వరకు పేరు తెచ్చుకున్నారు. అన్ని రకాల సినిమాలు చేస్తూ సినీ ప్రేక్షకులను అలరించారు. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతూ ఆకట్టుకున్నారు. ఆ తరువాత బ్లడ్ బ్యాంక్ లాంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే కొందరు మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి ఏం చేయలేదని, ఇంత పెద్ద స్టార్ అయినా సినిమాను పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పావలా శ్యామలా అనారోగ్యంగా ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి చాపల కూర వండుతుంటే నాగార్జున గారు వచ్చి టేస్టు చేశారన్న వీడియోను కొందరు అప్లోడ్ చేసి కొందరు కామెంట్లు పెట్టారు. అయితే కొందరు మెగా ఫ్యాన్స్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ‘ఆట సందీప్’ అనే మెగాఫ్యాన్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

    chiru ata sandeep

    ‘చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. ఆయన ఒక మహా వృక్షాన్ని తయారు చేశారు. ఆయన కింది నుంచి ఎంతో కష్టపడి మెగాస్టార్ స్టేజికి వచ్చారు. కొందరు మా తాత గారు ఇలా.. మా నాన్నగారు అలా.. అని చెప్పుకుంటారు. కానీ నువ్వుకష్టపడు.. నీ ప్రతిభ ఏంటి..? అనేది నిరూపించుకోవాలి. అది చిరంజీవిగారు నిరూపించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతీ విషయంపై చిరంజీవిగారే రెస్పాన్స్ అవుతారు. చిరంజీవి గారు సేవల చేయాలని బ్లడ్ బ్యాంకు స్థాపించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా స్థాపించారా..? కొవిడ్ లేని సమయంలోనే చిరంజీవిగారు ఈ బ్లడ్ బ్యాంకును పెట్టారు..’

    ‘చిరంజీవి గారు ఒక పోజిషన్ కు వచ్చిన తరువాత సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. అంటే ఎప్పుడో సేవ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఇతరులతో సంబంధం లేకుండా సేవలు చేస్తున్నా.. ఇంకా ఆయనను పాయింట్ చేసేవాళ్లు పుట్టుకొస్తున్నారు. అసలు చిరంజీవిగారు ఇతరులకు ఎందుకు సేవ చేయాలి..? ఆయన మనలాగే ఓ వ్యక్తి.. ఇతరులకు సాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఆయనను ఎందుకు పాయింట్ చేస్తున్నారు..? చిరంజీవి గారు ఇంట్లో చాపల కూర వండుకోకుడదా..? ఆయన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండకూడదా..?’

    ‘రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ప్రతీదానికి చిరంజీవి గారే రెస్పాండ్ కావాలా..? టీవీ ముందు కూర్చుని ప్రతి ఒక్కిరికీ సేవ చేయాలా..? ఇదెలా కరెక్టని అనుకుంటున్నారు..? ఇలాంటి విషయాపై ప్రభుత్వాలు స్పందిస్తాయి. కానీ చిరంజీవి గారి వైపు నుంచి ఎంతో కొంత సాయం చేస్తారు.. చేశారు. ఇవన్నీపని లేకుండా ఉండి మాట్లాడేవారి మాటలు. ఎదుటి వారు బాగుపడితే ఓర్వలేని కొందరు ఇలాంటి కామెంట్లు పెడుతారు.’

    ‘పావలా శ్యామల గారి గురించి కొంత ఫండ్ సేకరించాను. ఫేస్ బుక్లో ఆవిడ గురించి వేశాను. చాలా మంది ప్రెస్సు వాళ్లు డబ్బులు వేశారు. ఆ సమయంలో ఆమె కొంచెం రిలీఫ్ అయ్యారు. కానీ ఆమె గురించి మళ్లీ తెలుసుకోలేదు. కానీ అనారోగ్యానికి గురైయ్యారన్న విషయం తెలియదు. కానీ కొందరు ఆమె వీడియోస్ పట్టుకొని చిరంజీవిగారిపై బ్యాడ్ కామంట్ చేయడం బాగోలేదు.’

    ‘చిరంజీవి గారి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ సాయం చేస్తారు. అందుకు నేనే సాక్ష్యం. మా ఫాదర్ హాస్పిటల్ లో క్రిటికల్ కండీషన్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కు ఫోన్ చేసి నా ప్రాబ్లం గురించి చెప్పా. కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఒక్క బెడ్ కూడా దొరకని సమయంలో నాకోసం అపోలోలో బెడ్ ఇప్పించాడు. ఆయన సినిమా కోసం ఓ సాంగ్ చేశా. దానికి డబ్బలు పే చేశారు. కానీ మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. కానీ సాయం అడిగిన వెంటనే ఇలా స్పందించడం నిజంగా మానవత్వమే కదా..’ అని ఆట సందీప్ ఎమోషనల్ అయ్యారు.