Pawan Kalyan- Venu Swamy: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో జనవాణిని నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడ అతనికి ప్రతికూల వాతావరణమే ఏర్పడింది. పవన్ విశాఖకు వస్తున్న సమయంలో అధికార వైసీపీ గర్జన నిర్వహించడంతో రెండు పార్టీల నాయకులు ఒక్కచోటికి వచ్చారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ తరువాత పవన్ ను పోలీసులు బంధించడం.. జనసేన నాయకులను అరెస్టు చేయడం జరిగింది.. ఇక తనపై వచ్చిన విమర్శలపై పవన్ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక నుంచి యుద్ధమే ఉంటుందని ప్రకటించారు. అయితే పవన్ ఏం చేసినా అనుకూలించకపోవడానికి ఆయన చేతి వేలికి ఉన్న ఉంగరమేనని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే దానిని తీసేయాల్సిందిగా ఆయన హెచ్చరించారు.

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అప్పుడప్పుడు ప్రముఖులపై సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తారు. కొందరి జీవితాలకు సంబంధించిన జాతకాలను వారు అడగకపోయినా బయటపెట్టేస్తారు. ఇలా తాను చెప్పినవి కొన్ని నిజమయ్యాయని ఆధారాలు కూడా చూపించారు. ఆయన చెప్పినవి కొందరు పట్టించుకోకపోయినా..కొందరు మాత్రం బాగా నమ్ముతారు. ఇటీవల సినీ స్టార్ కపుల్స్ నాగచైతన్య- సమంతలు విడిపోతారని నేను ముందే చెప్పానని అన్నారు. వారు పెళ్లి చేసుకున్నప్పుడే వారు జీవితాంతం కలిసుండరని ముందే హెచ్చరించానన్నారు. అయితే ఆయయ చేసిన వ్యాఖ్యలపై నాగ్ ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఈరోజుల్లో జాతకాలు ఎవరు నమ్ముతారు..? అని ప్రశ్నించారు.
ఆ విషయం ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేతి వేలికున్న సర్పాకారంలో ఉన్న ఉంగరం అంతమంచిది కాదన్నారు. పవన్ జాతక ప్రకారం.. ఆయన సెప్టెంబర్ 2, 1971లో జన్మించారు. ఆయనది ఉత్తారాషాఢ నక్షత్రం. మకరరాశిలో గురువు మీద శని దృష్టి ఉంది. చంద్రుడు-కుజుడుతో వచ్చే రాహువు కలిసి ఉన్నాడు. అందువల్ల సర్పాకారం ఉంగరం పవన్ చేతికి ఉండడం మంచిది కాదన్నారు.

అయితే పవన్ చేతికున్న ఈ ఉంగరాన్ని తీసేయాలని వేణుస్వామి ‘బీమ్లానాయక్’ ఫ్రీరిలీజ్ వేడుక సందర్భంగా తెలిపారు. కానీ పవన్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలు రాజకీయంగా వేడిని రగిల్చాయి. అయితే జనసేన నాయకుల అరెస్టుతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో వేణుస్వామి మరోసారి మీడియాలో ఉంగరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా చాలా మంది సినీ, రాజకీయ నాయకులు జాతకాలు ఎక్కువగానే నమ్ముతారు.మరి పవన్ ఈ ఉంగరంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.