
Ashureddy: బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి అంటే తెలియనివారుండరు. ఆమెకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని స్టార్డం ఆమె సొంతం. గ్లామర్ షోతో బోల్డ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన బూతు ఇంటర్వ్యూల గురించి ఎంత చెప్పినా తక్కువే. వర్మ-అషురెడ్డి కలిసి రూపొందించిన రెండు ఇంటర్వ్యూలు యూట్యూబ్ షేక్ చేశాయి. అషురెడ్డి కాలి వేళ్ళు వర్మ నోట్లో పెట్టుకోవడం అరాచకానికి పరాకాష్ట అని చెప్పాలి.
ఇంస్టాగ్రామ్ లో అషురెడ్డిని దాదాపు రెండు మిలియన్స్ ఫాలో అవుతున్నారు. దానికి కారణం ఆమె స్కిన్ షో చేయడమే. అరాకొరా బట్టల్లో విచ్చలవిడి అందాల ప్రదర్శన చేస్తుంది. సాంప్రదాయవాదులు నొచ్చుకునేలా ఆమె తీరు ఉంటుంది. అషురెడ్డి హాట్ ఫోటోల క్రింద పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తారు. అయితే అవేమీ అషురెడ్డిని మార్చలేవు. సోషల్ మీడియా సెలెబ్రెటీలకు ఆదాయ మార్గం అయ్యింది.
ఎంత స్కిన్ షో చేస్తే అంతగా ఫాలోవర్స్ పెరుగుతారు. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా డిమాండ్, బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తారు. ఈ కారణంతోనే విమర్శలు పట్టించుకుండా సెలెబ్రిటీలు అందాల ప్రదర్శనకు దిగుతారు. ఇక బిగ్ బాస్ షో అషురెడ్డికి మరింత పాపులారిటీ తెచ్చింది. సోషల్ మీడియా సెలబ్రిటీ కాస్తా బుల్లితెర స్టార్ గా ప్రమోట్ అయ్యారు.
కాగా అషురెడ్డి హఠాత్తుగా ఆసుపత్రి పాలయ్యారు. ఆమె బెడ్ పై అనారోగ్యంతో పడి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు సైలెన్స్ కూడా ఎక్కించినట్లున్నారు. అషురెడ్డి కుంటుతూ, అతికష్టంగా నడుస్తున్న వీడియో సైతం బయటకు వచ్చింది. అషురెడ్డి తన అనారోగ్య పరిస్థితి తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్లు సమాచారం. ఒక్కసారిగా ఆసుపత్రి పాలైన అషురెడ్డికి ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
కాగా ఈ మధ్య బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. ఆమె నటిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న అషురెడ్డి ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ పలుమార్లు సన్నిహితంగా కనిపించారు