Dasara Trailer Talk: న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ‘దసరా’ చిత్రం ఈ నెల 30 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం విడుదల చేశారు.నాని ఈ సినిమా గురించి మొదటి నుండి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు,#RRR మరియు కాంతారా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇండియన్ సినిమా చరిత్రలో ఎలాంటి ప్రభంజనాలు సృష్టించాయో, నా ‘దసరా’ చిత్రం కూడా అదే రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను అంటూ టీజర్ లాంచ్ రోజు చెప్పుకొచ్చాడు.

అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో ఊహించుకున్నారు.టీజర్ బాగుండడం తో, సినిమా కూడా అదిరిపోతోంది, ట్రైలర్ వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ ఫిలిం నగర్ లో టాక్ జోరుగా ప్రచారమైంది.అదే రేంజ్ అంచనాల నడుమ నేడు విడుదలైన ట్రైలర్ హైప్ ఇచ్చిన రేంజ్ లో లేదని ఫ్యాన్స్ అంటున్నారు.
నాని మేక్ ఓవర్, ఆయన మాట్లాడుతున్న తెలంగాణ యాస అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఎక్కడో ఎదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అందరిలో కనపడింది.బహుశా వరుసగా యూత్ ఫుల్ మూవీస్ చేస్తూ, ఒక్కసారిగా ఇంత మాస్ రోల్ లో కనిపించేసరికి అభిమానులకు తీసుకోవడం కాస్త కష్టం అయ్యింది అనుకోవచ్చు,అంతే కాదు ఆ యాస కూడా అందరికీ అర్థం అవుతుందా లేదా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.
వారం రోజుల క్రితం విడుదలైన ‘చమ్కీల అంగీలేసి’ అనే పాట చాలా మంది నెటిజెన్స్ కి అర్థం కాలేదు, దీనిపై సోషల్ మీడియా లో పెద్ద రచ్చే జరిగింది.సినిమా కూడా ఇలాగే ఉంటే మాత్రం నాని అనుకున్న దానికి పూర్తిగా రివర్స్ ఫలితం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.అయితే ఈరోజు విడుదలైన ట్రైలర్ లో లాస్ట్ షాట్ లో నాని ‘నీ అవ్వ’ అంటూ విలన్ మొహం మీద నాన్ స్టాప్ గా పిడిగుద్దులు గుద్దే షాట్ హైలైట్ గా నిల్చింది.