Spirits: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో హాలో వీన్ పండుగను జరుపుకుంటారు. ఇది క్రైస్తవ మతం వారు నిర్వహించుకోవడం ఆనవాయితీ. క్రీస్తుపూర్వం నుంచి ఐర్లండ్, యూకే, ఉత్తర ఫ్రాన్స్ లలో ఉన్న సెల్ట్స్ తెగ ప్రజలు హాలోవీన్ ప్రజలు జరుపుకుంటారు. నవంబర్ 1 నుంచి వ్యాధులు విజృంభిస్తాయనే ఉద్దేశంతో అక్కడి వారు ఈ పండుగ జరుపుకోవడం మామూలే. కానీ అక్కడ ఇప్పటి నుంచి ఆత్మలు కూడా సంచరిస్తాయనే ఉద్దేశంతో వాటి నుంచి తప్పించుకోవడానికి వారు భయంకరమైన దుస్తులు ధరిస్తుంటారు.

ఆత్మల నుంచి తప్పించుకోవడానికి రకరకాల పద్ధతులు పాటిస్తారు. ఇళ్ల ముందు గుమ్మడికాయలు కట్ చేసి వాటిల్లో దీపాలు వెలిగిస్తారు. జంతువులను బలిచ్చి వాటి తలలను నెత్తిన పెట్టుకుని చర్మాలను శరీరంపై ధరిస్తారు. ఇలా చేస్తే వ్యాధులు దరిచేరవని విశ్వసిస్తారు. ఈ ఆచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల వారు జరుపుకోవడం విశేషం. ఇలాంటి ప్రదేశాలు మన దేశంలో కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. పలు ప్రాంతాలలో దెయ్యాలు ఉన్నాయని భయపడటం చూస్తుంటాం.
మన దేశంలో రాజస్తాన్ లోని భంగర్ కోట దెయ్యాల కోటగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్యాలెస్పై చేతబడి చేశారని, అందుకే అప్పటి నుంచి ఇది దెయ్యాల కోటగా మారిందని చెబుతుంటారు. సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి ఎవరు ప్రవేశించరు. చాలా మందికి ఇక్కడ దెయ్యాలు పట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా దెయ్యాలున్నాయని ప్రచారం సాగుతోంది. హోటళ్లలో వేలిముద్రలు, విచిత్రమైన నీడలు, తలుపులు వాటంటవే తెరుచుకోవడంతో అందరు భయపడుతుంటారు.

దేశంలోని అందమైన బీచ్ లలో గుజరాత్ డుమాస్ బీచ్ ఉంది. ఇక్కడ కొందరు మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తారు. దీంతో అక్కడ దెయ్యాలు సంచరిస్తుంటాయని అక్కడి వారు చెబుతుంటారు. సిమ్లాలోని కల్కా రోడ్ లో టన్నెల్ నెం.103 ఉంది. ఇక్కడ కూడా చాలా ఆత్మలున్నాయని నమ్ముతారు. ఇలా దెయ్యాలు సంచరించే ప్రాంతాలు మన దేశంలో కూడా ఉండటంతో ప్రజలు సాయంత్రం అయిందంటే చాలు అక్కడికి వెళ్లడానికి జంకుతున్నారు. దెయ్యాల భయంతో గజగజ వణుకుతున్నారు.