Allu Arjun arrested : ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. భారీ భద్రత అతడిని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు.. అరెస్ట్ కంటే ముందు పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాతే అతడిని అదుపులోకి తీసుకున్నారు.. పెద్ద హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు అభిమానులు మరణించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అప్పుడు కేసులు నమోదు కాలేదు. అప్పటి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల అతని అభిమానులు మండిపడుతున్నారు. బన్నీ అరెస్టు వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మెగా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచింది. అల్లు అర్జున్ మాత్రం తన మిత్రుడు శిల్పా రవికుమార్ రెడ్డి కి మద్దతుగా నిలిచారు. నంద్యాల వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. పుష్ప -2 విడుదలకు మందు జరిగిన వేడుకల్లో మెగా కుటుంబం కనిపించలేదు. మెగా కుటుంబం నుంచి సాయి ధరంతేజ్ మినహా మిగతావారు శుభాకాంక్షలు తెలియజేయలేదు.. ఇక సినిమా విడుదల తర్వాత విజయోత్సవ సభలో టికెట్ల ధరలు పెంచడానికి అనుమతి ఇచ్చినందుకు గానూ తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఆయన మర్చిపోయారు. ఈ వ్యవహారంపై కూడా అల్లు అర్జున్ విమర్శలు ఎదుర్కొన్నారు. వీటన్నిటి మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. వాస్తవానికి ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం అతడిని పోలీసులు కోర్టుకు తరలిస్తున్నారు.
ఈ ఘటన ద్వారా..
ఈ ఘటన ద్వారా తెలంగాణ ప్రభుత్వం చట్టం ముందు ఎవరైనా సమానమైన అని నిరూపించింది. పెద్ద హీరో అయినప్పటికీ అల్లు అర్జున్ తమకు సాధారణ పౌరుడేనని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.. అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. దానికంటే ముందు అతడి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు వార్త దావనం లాగా వ్యాపించడంతో అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. వారందరికీ చదరగొట్టడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అల్లు అర్జున్ ను పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. దానిపై సాయంత్రం నాలుగు గంటల్లోగా తీర్పు వస్తుందని సమాచారం. ఆ తీర్పు కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.