Cancer Vaccine: అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్, ఎయిడ్స్ ఉన్నాయి. ఎయిడ్స్ అంటు వ్యాధి కాగా క్యాన్సర్ మాత్రమే మన శరీరంలోనే తయారవుతుంది. ఇలా క్యాన్సర్ తో ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. ఎయిడ్స్ ప్రస్తుతం నియంత్రణలో ఉంది. దీనిపై అందరికి అవగాహన రావడంతో దాదాపుగా ఇది అంతరించినట్లే. కానీ క్యాన్సర్ మాత్రం పడగ విప్పుతోంది. ఒకప్పుడు లక్ష మందిలో ఒకరికి కనిపించే వ్యాధి ప్రస్తుతం వంద మందిలో ఒకరికి కనిపిస్తోంది. క్యాన్సర్ మహమ్మారి ఎంతగా విస్తరించిందో ఈ లెక్కలు చూస్తుంటే తెలుస్తూనే ఉంది.

క్యాన్సర్ వైద్యం చేయించుకోలేని రోగంగా చూస్తున్నారు. త్వరలో క్యాన్సర్ కు టీకా కూడా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ రోగాన్ని ఎదుర్కొనే టీకా త్వరలోనే వెలుగు చూస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ టీకా త్వరలో రోగుల చెంతకు చేరనుంది. శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన పనుల్లో తలమునకలై ఉన్నారు. క్యాన్సర్ కు త్వరలో రాబోయే టీకా ఫ్లూ, పోలియో వంటి టీకాల మాదిరిగా జబ్బును అదుపులో ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సాయపడుతుంది.
రోగనిరోధక చికిత్సను ఎంఆర్ఎన్ఏ టీకాతో కలిపి తీసుకుంటే చర్మ క్యాన్సర్ తిరగబెట్టే ముప్పు ఉందని చెబుతున్నారు. దీంతో క్యాన్సర్ ఉన్న వారిలో ముప్పు 44 శాతం వరకు తగ్గుతున్నట్లు బయటపడింది. క్యాన్సర్ రోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఎంఆర్ఎన్ఏ ఆధారిత క్యాన్సర్ టీకా సామర్థ్యంతో చికిత్సలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల్లోనే కణితిలోని జన్వులకు అనుగుణంగా ఉంటుంది. క్యాన్సర్ టీకా విషయంలో టీకా బయటకు వస్తోందని తెలుస్తోంది. క్యాన్సర్ టీకా రానుందనే వార్తపై అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో మంది క్యాన్సర్ గురించి తెలియక దాని బారిన పడుతున్నారు. రోగం గురించి తెలియకపోవడంతో దాని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ ముప్పు పై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా క్యాన్సర్ కు టీకాలు రానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈసారి మాత్రం టీకా రావడం ఖాయంగానే కనిపిస్తోంది. క్యాన్సర్ ముప్పును తప్పించుకునేందుకు టీకా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మొత్తానికి క్యాన్సర్ పేషెంట్లకు టీకా వస్తుతందనే ఆశే ఎంతో బలంగా మారుతోంది.