April Fools Day: వచ్చేది ఏప్రిల్ మాసం. ఉదయం లేవగానే ఏప్రిల్ ఫూల్ అంటూ సన్నిహితులను, మిత్రులను ఫూల్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయినా, ఈ ‘ఫూల్స్ డే’ అనగానే పెద్ద మనిషిలో కూడా ఓ చిన్నపిల్లాడు బయటకు వస్తాడు. సరదాగా పూల్ చేయడం కోసం గాలి వార్తలు అల్లుతూ ఆ పిల్లాడు అల్లరి చేస్తుంటాడు. అందుకే.. ఏప్రిల్ అంటేనే.. అల్లరి నెల.

ఈ అల్లరిలో భాగంగా విన్నవారు అవునా ? నిజమా ? అని ఆలోచించే లోపే ఏప్రిల్ ఫూల్ అంటూ ఆట పట్టించేస్తారు. ఏప్రిల్ నెల మొదటి రోజు ఎక్కడ చూసినా ఆ రోజంతా సరదాలు, ఆనందాల మధ్య నవ్వులు విరబూస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలైతే ముందురోజు నుంచే ఎవరిని ఎలా ఫూల్ చేయాలా ? అని ప్లాన్ చేస్తారు.
Also Read: పవన్ కళ్యాణ్ యే సీఎం.. టీడీపీని డిఫెన్స్ లో పడేసిన సోము వీర్రాజు
అసలు ఇంతకీ… ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా ? అయినా మనవాళ్లను మనమే ఫూల్స్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ డే ఏర్పాటు చేసుకోవాలి అనే థాట్ అసలు ఎలా వచ్చి ఉంటుంది ? మొదటగా ఎవరికి వచ్చి ఉంటుంది ? చూద్దాం రండి.
ఈ ‘ఫూల్స్ డే’ సాంప్రదాయం మొదట యూరప్‌లో పుట్టింది. యూరప్ నుంచే ప్రపంచానికి చాలా వేగంగా పాకింది.
అయితే, ఏప్రిల్ నెలలోనే ఈ ‘ఫూల్స్ డే’ను ఎందుకు పెట్టారు ?
అది 1582 వ సంవత్సరం.. యూరోప్ లో అప్పటి కాలంలో’జూలియన్ క్యాలెండర్’ ప్రకారం.. మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అక్కడి ప్రజల ఆనవాయితీ. కాకపోతే.. 1582 తర్వాత ‘జూలియన్ క్యాలెండర్’ స్థానంలో 13వ పోప్ గ్రెగొరీ ఓ కొత్త క్యాలెండర్ ని రిలీజ్ చేశాడు. ఆ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలి.

కానీ, ఈ నిర్ణయాన్ని అప్పటి అనేక దేశాలు తీవ్రంగా తిరస్కరించాయి. కాకపోతే.. గ్రెగొరీ ప్రవేశ పెట్టిన కొత్త క్యాలెండర్ ను అప్పటి కొంతమంది ప్రజలు బాగా ఇష్టపడ్డారు. వాళ్ళంతా జనవరి 1న తమ కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవడం అలవాటు చేసుకున్నారు.
కానీ.. ఈ క్యాలెండర్ ను తిరస్కరించి.. ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునే ప్రజలను కాలక్రమేణా ఫూల్స్ గా జమకడుతూ వచ్చారు. చివరకు అలా ‘ఏప్రిల్ ఫూల్స్’ పుట్టుకొచ్చింది.
Also Read: మోడీ సార్ బాదుడు మొదలెట్టాడు.. వామ్మో గ్యాస్.. మళ్లీ పెట్రో మంటలు
Recommended Video: