https://oktelugu.com/

Anuty Acid Attack: ఆమెకు 45.. అతడికి 20.. తనతో ఆ పని చేయడం లేదని యాసిడ్ పోసిన ఆంటీ!

గుంటూరుకు చెందిన రాధ(45) భర్త చనిపోయాడా.. లేక ఈ ఆంటీని తట్టుకోలేక వదిలేసి పోయాడో తెలియదు కానీ.. సదరు ఆంటీ మాత్రం భర్త లేడన్న విషయం పక్కన పెట్టి 20 ఏళ్ల యువకుడు వెంకటేశ్‌కు వల విసిరింది.

Written By: , Updated On : October 6, 2023 / 11:46 AM IST
Anuty Acid Attack

Anuty Acid Attack

Follow us on

Anuty Acid Attack: పరువు తక్కువ పని చేస్తున్న కొంతమంది మహిళలు.. ఐనవారిని కూడా దూరం చేసుకుంటున్నారు. వివాహేతర సబంధం నెరపుతూ భర్తనే కడతేరుస్తున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయినా ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. తమేదో ఘనకార్యాం చేశామన్నట్లు భావిస్తున్నారు. పిల్లలను అనాథలను చేస్తున్నారు. అయితే ఇక్కడో విచిత్ర ఘటన జరిగింది. 20 ఏళ్ల యువకుడితో సహజీవనం సాగిస్తున్న 45 ఏళ్ల మహిళ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మనస్పర్థల కారణంగా కొంతకాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. దీంతో బరితెగించిన ఆంటీ యువకుడు తనవద్దకు రావడం లేదని ఏకంగా యాసిడ్‌ దాడిచేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగింది.

ఇద్దరూ సహజీవనం..
గుంటూరుకు చెందిన రాధ(45) భర్త చనిపోయాడా.. లేక ఈ ఆంటీని తట్టుకోలేక వదిలేసి పోయాడో తెలియదు కానీ.. సదరు ఆంటీ మాత్రం భర్త లేడన్న విషయం పక్కన పెట్టి 20 ఏళ్ల యువకుడు వెంకటేశ్‌కు వల విసిరింది. వయసులో ఉన్న వెంకటేశ్‌ టైంపాస్‌ అవుతుందని ఆంటీని తగులుకున్నారు. ఇంకేముందు కొన్నాళ్లుగా స్వర్గసుఖాల్లో తేలిపోతున్నారు.

వదిలించుకుందామని..
అయితే సదరు యువకుడు వెంకటేశ్‌కు ఆంటీ తనను వదిలేలా లేదని అర్థమైనట్లు ఉంది. ఆమెతో ఉంటే తన భవిష్యత్‌ అంధకారం అవుతుందని భావించాడు. వదిలించుకోవాలని దూరం దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎడబాటును భరించలేకపోయిన ఆంటీ రాధ.. వెంకటేశ్‌తో గొడవ పడింది. ఈ గొడవ కూడా తన మంచికే జరిగిందని భావించిన వెంకటేశ్‌ ఇదే అవకాశంగా భావించి రాధ ఇంటికి రావడమే మానేశాడు.

ఎడబాటు భరించలేక..
అయితే వెంకటేశ్‌తో ఎడబాటును రాధ భరించలేకపోయింది. తన వద్దకు రావడం లేదని అసహనానికి గురైంది. తనకు దక్కని వెంకటేశ్‌ ఎవరికీ దక్కొద్దని భావించింది. ఈ క్రమంలో అదును చూసి యాసిడ్‌ దాడి చేసింది. అదృష్టవశాత్తు వెంకటేశ్‌ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. యాసిడ్‌ పూర్తిగా పడి ఉంటే ప్రాణాలు పోయేవని స్థానికులు అంటున్నారు. అణకువకు పరమార్థమైన మహిళ ఇలా బరితెగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు వెంకటేశ్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.