
Prabhas- Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కపుల్స్ ఫేవరేట్ గా నిలుస్తాయి. అలనాడు చిరంజీవి-విజయశాంతి, వెంకటేశ్- సౌందర్యలు కలిసి నటించిన సినిమాలన్నీ దాదాపుగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ప్రభాస్, అనుష్కలు కలిసి సినిమా తీస్తే బొమ్మ బ్లాక్ బస్టరే అనే ముద్ర పడింది. వీరిద్దరు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో నటించిన విషయం తెలిసింది. ఈ సినిమాలన్నీ హిట్టు కొట్టాయి. అయితే బాహుబలి సినిమాల తరువాత ప్రభాస్ వరుసబెట్టి సినిమాలు తీస్తున్నా ఒక్కటీ బ్లాక్ బస్టర్ కాలేదు. అటు అనుష్క సినిమాలు అసలే రావడం లేదు. దీంతో తమకు ఇప్పటికే బాహుబలి సినిమానే ఫేవరేట్ అని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సందర్భంగా ప్రభాస్ తో గడిపిన క్షణాలను అనుష్క ఇప్పటికీ తలుచుకుంటున్నారని తెలుస్తోంది.
కొన్ని నెలల కింద వీరి సాన్నిహిత్యం చూసిన త్వరలో వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారన్న వార్తలు గుప్పుమన్నాయి. సినిమాల్లోని కొన్ని పెళ్లి ఫొటోలను మిక్స్ చేసి వీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారని పోస్టులు కూడా పెట్టారు. కానీ అవి నిజం కాదని తెలిసిపోయాయి. అయితే వీరిద్దరు మాత్రం ఇప్పటికీ ఎవరినీ పెళ్లి చేసుకోకపోవడంతో ఎప్పటికైనా ఈ జంట ఒక్కటవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.ఇలాంటి గాసిప్స్ పై గతంలో ప్రభాస్, అనుష్కను అడిగితే మేం మంచి స్నేహితులం మాత్రమే.. అని సెలవిచ్చారు.
అనుష్క సినిమాల్లో పెద్దగా కనిపించికపోయినా ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ఇటీవల ప్రభాస్ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో ప్రభాస్, అనుష్కలు ఓసారి విదేశాల్లో దిగిన ఫొటోను వైరల్ చేశారు. దీంతో ప్రభాస్ తో పాటు అనుష్క కూడా ఆయనతో వెళ్లిందా అనే అనుమానాలు వచ్చాయి. కానీ అది సృష్టికర్తల పనే అని తెలిపోయింది.

ఇక లేటేస్టుగా అనుష్క మరో ఫొటోతో సందడి చేస్తోంది. బాహుబలిలో వీరిద్దరు రాజు, రాణి గెటప్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ ఇమాజినేషన్ ను ఓ ఆర్టిస్టు తన కుంచె ద్వారా ఓ బోర్డుపై చిత్రీకరించాడు. దానిని అనుష్కకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ ఫొటోను అనుష్క పట్టుకొని ఫొటో దిగారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ అనుష్క ఇంకా ప్రభాస్ ను మరిచిపోలేకపోతున్నారా?తన గుండెల్లోనే పెట్టుకున్నారా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్స్ పై అనుష్క ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.