Anupama Parameswaran: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వనున్నారట. ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అభిమానులను తీవ్ర నిరాశ పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ చిత్రం ప్రేమమ్ తో వెండితెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ ‘అ ఆ’… మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మలయాళ ప్రేమమ్ తెలుగు రీమేక్ లో నాగ చైతన్యతో జతకట్టింది. శతమానం భవతి సూపర్ హిట్ కాగా అనుపమకు టాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో అమ్మడు మంచి ఫేమ్ రాబట్టింది.

ఇక లేటెస్ట్ సెన్సేషన్ కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకుంది. నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. కార్తికేయ 2 డబుల్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. హిందీలో ఊహించని రెస్పాన్స్ దక్కించుకున్న కార్తికేయ 2 రూ. 30 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓ చిన్న చిత్రానికి ఆ మాత్రం వసూళ్ళంటే సాధారణ విషయం కాదు. కార్తికేయ హిట్ 2 అనుపమ కెరీర్ మరలా ఊపందుకుంది.
Also Read: Hari Hara Veera Mallu: ‘బుక్ మై షో’ యాప్ లో సంచలన రికార్డు ని నెలకొల్పిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం
ఇటీవల కెరీర్ నెమ్మదించి అవకాశాలు లేక అల్లాడిన అనుపమ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్యూట్ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందట. సినిమాలు పూర్తిగా మానేసి పెళ్లి చేసుకొని సెటిలైపోతుందట. ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసి ఇకపై కొత్త చిత్రాలకు సైన్ చేయరట. అనుపమ ఈ విషయంలో స్ట్రాంగ్ గా ఉన్నారని, ఇదే ఫైనల్ అంటున్నారు. ఆమె పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటుండగా అనుపమ వెండితెరకు దూరం కానుంది అంటున్నారు.

అనుపమ ప్రస్తుత వయసు 26 సంవత్సరాలు. అంటే పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్. హీరోయిన్స్ కి మాత్రం అది పెళ్లీడు కాదు. కనీసం 35 ఏళ్ళు దాటాకే పెళ్లి అంటారు. అప్పటికీ ఫార్మ్ లో ఉంటే పెళ్లి పక్కన పెట్టేస్తారు. ఆఫర్స్ లేక ఫేడ్ అవుట్ దశకు చేరినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటారు. అలాంటిది అనుపమ మాత్రం పెళ్లి కోసం కెరీర్ వదిలేయడం సంచలనంగా మారింది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో 18 పేజెస్, బట్టర్ ఫ్లై అనే రెండు చిత్రాలు ఉన్నాయి.
Also Read: Ponniyan Selvan Actors Remuneration: పొన్నియిన్ సెల్వన్-1 తారల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే?
[…] Also Read: Anupama Parameswaran: షాకింగ్ న్యూస్… సినిమాలకు గు… […]