
Delhi Metro: “కామా తురాణం న భయం న లజ్జ” అనే ఓ నానుడి ఉంది. ఈ నానుడికి ఢిల్లీ యువత వక్ర భాష్యం చెబుతోంది. చుట్టూ జనం ఉన్నారనే సోయి లేకుండా, మెట్రో లో ప్రయాణిస్తున్నామనే భయం లేకుండా ఓపెన్ గా పని కానిచ్చేస్తున్నారు. వారి వేషాలు చూడలేక తోటి ప్రయాణికులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. బరితెగిస్తున్న యువత తీరుతో ఢిల్లీ మెట్రో సిబ్బంది కూడా చూపు పక్కకు తిప్పుకుంటున్నారు. ఈ మధ్య మెట్రోలో యువ జంట… చుట్టూ ప్రయాణికులు ఉన్నారనే సోయి లేకుండా లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. పక్కనే ఉన్న కొంతమంది దీనిని వీడియో తీశారు. సోషల్ మీడియాలో పెట్టడంతో రచ్చ రచ్చ అయిపోయింది. ఇది మర్చిపోకముందే మరొక జంట మెట్రో రైల్ లో హగ్గులకు దిగారు. లిప్ లాక్ లకు దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో.. ఢిల్లీ మెట్రోలో డర్టీ పిక్చర్ షూటింగ్ లు నడుస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఢిల్లీలో కాలుష్యం వల్ల మెట్రోలో ఎక్కువ ప్రయాణం చేయాలని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు మెట్రోలోనే వెళుతుంటారు. ఈ క్రమంలో ఆ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కనీసం అడుగు తీసి అడుగు వేసే సందు కూడా ఉండదు. దీనినే అవకాశం గా మలుచుకున్న యువతీ యువకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విరహాన్ని తట్టుకోలేక ముద్దులు, హగ్గులతో రెచ్చి పోతున్నారు. దీంతో తోటి ప్రయాణికులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక చూపు పక్కకు తిప్పుకుంటున్నారు. కొంతమంది యువత అయితే ముద్దులు, హగ్గుల స్థాయి దాటిపోయి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీనిపై మెట్రో యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.

ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.” తోటి ప్రయాణికులారా ఢిల్లీ మెట్రో ఎక్కకండి.. ఎందుకంటే అందులో డర్టీ పిక్చర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సన్నివేశాలు చూసి మీరు తట్టుకోలేరు” అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ” చెట్లు, పుట్టలను తొలగిస్తే యువత మాత్రం ఏం చేస్తారు? ఇలా మెట్రోలో పని కానిస్తున్నారు.. వారికి మాత్రం ఏకాంతం ఎక్కడ దొరుకుతోంది. వయసు వేడికి వారు మాత్రం ఏం చేయగలుగుతారు” అని కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మరి కొందరైతే” ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తే అడల్ట్ సినిమా ఉచితంగా చూడవచ్చు” అని చలోక్తులు విసురుతున్నారు.
ఇక మన హైదరాబాదులో కూడా గతంలో ఇటువంటి సంఘటనలు జరిగాయి. కొంతమంది యువత లిఫ్టులోనే ముద్దులకు దిగడంతో మెట్రో యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఎక్కడికి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. యువత ప్రవర్తన ఏ మాత్రం తేడాగా అనిపించినా పోలీసులకు ఫిర్యాదు చేస్తోంది. గతంలో సుమారు 14 మంది యువతపై పోలీసులు కేసు నమోదు చేయడంతో.. మిగతా వారిలో మార్పు వచ్చింది. అయితే ఢిల్లీ మెట్రోలో డర్టీ పిక్చర్ జరుగుతున్నప్పటికీ అక్కడి యాజమాన్యం ఇటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం విశేషం.
रोज़ @OfficialDMRC से ऐसे वीडियो या तस्वीरें आ हीं जाती है।
बच्चों के साथ Web Series देख नहीं सकते,गाना सुन नहीं सकते, फ़िल्म देख नहीं सकते और अब – – Metro से भी परहेज़। #Train #Metro #delhimetro pic.twitter.com/A9PdG00D2C— SHAMSHER SINGH (@ShamsherSLive) April 3, 2023